1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By IVR
Last Modified: గురువారం, 24 జులై 2014 (18:16 IST)

వార్నీ వీడు ముష్టోడు కాదు... కోటీశ్వరుడు...

ఓ బిచ్చగాడు పోలీసులకే షాక్ ఇస్తూ కోటీశ్వరుడుగా కనబడ్డాడు. సౌదీ అరేబియాలో భిక్షమెత్తుతున్న అరబ్ జాతీయుడయిన బిచ్చగాడిని పోలీసులు పట్టుకున్నారు. సౌదీ అరేబియాలో భిక్షాటన నిషిద్ధం కనకు చట్టాన్ని వ్యతిరేకిస్తూ భిక్షాటన చేస్తున్న అతడిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. ఆశ్చర్యకరంగా ఆ భిక్షగాడి వద్ద నగదుతోపాటు 12 లక్షల సౌదీ రియల్స్ లభించాయి. దీనితో ఆ బిచ్చగాడు కోటీశ్వరుడని తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. యాచక వృత్తిలో అతగాడు 3 లక్షల అమెరికన్ డాలర్ల ఆస్తిపరుడని అధికారుల దర్యాప్తులో తేలడం గమనార్హం.
 
ఒక గల్ఫ్ దేశం నుంచి పెట్టుబడిదారు లైసెన్సు కూడా అతగాడు పొందినట్లు బయటపడింది. ఆ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా సౌదీలో చట్టవిరుద్ధంగా విలాసవంతంగా నివసిస్తున్నారు.