యువతిని కుక్కలా కట్టేసి.. కళ్ల ముందే ఆమె ప్రియుడిని చంపేశాడు...
మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలను ఆపేందుకు ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్నా... ఇవి మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా అమెరికాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని కుక్కలా కట్టేసి.. ఆమె కళ్లముందే ఆమె ప్రియ
మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలను ఆపేందుకు ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్నా... ఇవి మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా అమెరికాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిని కుక్కలా కట్టేసి.. ఆమె కళ్లముందే ఆమె ప్రియుడిని చంపేసిన ఘటన ఒకటి సౌత్‌కరోలినాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈ ప్రాంతానికి చెందిన ‘టోడ్ కోలీప్ప్’ అనే రేపిస్టు ఓ ప్రేమ జంటను కిడ్నాప్ చేశాడు. యువతిని ఓ ఇనుప గొలుసుతో కుక్కలా కట్టేశాడు. అనంతరం యువకుడిని ప్రియురాలి కళ్లముందే ఘోరంగా చంపేశాడు. ‘నీ ప్రియుడిని ఎలా చంపుతున్నామో చూడు’... అంటూ యువతికి నరకం చూపించాడు. బాధితురాలు బ్రౌన్ కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును విచారించిన పోలీసులు యువతిని బతికించగలిగారు. తనను నిందితుడు ఏ విధంగా ఇబ్బందిపెట్టింది బాధితురాలు పోలీసులకు వివరించింది. నిందితుడిని విచారించిన పోలీసులు నిర్ఘాంతపోయే మరిన్ని నేరాలను బయటపెట్టారు. గతంలో కూడా ఈ నిందితుడు పలు ఘోరాలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది.