శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (18:05 IST)

టీకా ఉత్పత్తిని పెంచండి.. లేకుంటే కరోనా వదలదు.. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి

జీ-7 దేశాలు టీకా ఉత్పత్తి పెంచకపోతే కరోనా 2024 వరకు పోయే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి జాన్-ఈవ్స్ లెడ్రియాన్ హెచ్చరించారు. పేటెంట్ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తున్నది కానీ టీకాల ఉత్పత్తి పెంచడం అంతకన్నా ముఖ్యం అని ఆయన అన్నారు. 
 
లండన్‌లో జీ-7 విదేశాంగమంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, పేదదేశాలకు కరోనా టీకాలు సత్వరమే అందాల్సిన అవసరముందని, అందులో సంపన్న దేశాల కూటమి అయిన జీ-7 బాధ్యత చాలా ఉంటుందని లెడ్రియాన్ గుర్తు చేశారు. 
 
ప్రస్తుత టీకాల ఉత్పత్తి వేగం ఇదే తీరున నత్తనడకన సాగితే 2024 దాకా కరోనా పోదని నొక్కిచెప్పారు. అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ ను ప్రచార సాధనంగా వాడుకుంటున్నాయని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి విచారం వ్యక్తం చేశారు. 
 
లక్షల డోసులు తెచ్చి విమానాశ్రయాల్లో దింపి వెళ్లిపోతున్నాయని, సంఘీభావం అంటూ, మంచితనమంటూ చెప్పుకుంటున్నాయని అన్నారు. ఈ తరహా ప్రచారాలకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు.