శ్రీలంకలో కర్ఫ్యూ - ఇంటర్నెట్ సేవలు బంద్ - స్వదేశీ విమాన సేవలు రద్దు

srilanka
Last Updated: ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (16:18 IST)
ఈస్టర్ సండే రోజన వరుస పేలుళ్ళతో వణికిపోయింది. చర్చిలు, స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఆత్మాహుతి దళ సభ్యులు మారణహోమం సృష్టించారు. మొత్తం ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో సుమారుదు 200 మంది వరకు చనిపోయినట్టు సమాచారం.

కొలంబోలోని షాంగ్రిలా హోట‌ల్‌లో ఈనెల 20వ తేదీన ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ రూమ్ బుక్ చేసుకున్నారు. వారు రూమ్ నెంబ‌ర్ 616లోకి చెకిన్ అయ్యారు. అయితే హోట‌ల్‌లోని సీసీటీవీ దృశ్యాల ప్ర‌కారం.. ఆ ఇద్దరు అనుమానితులు సూసైడ్ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

షాంగ్రిలా హోట‌ల్‌లోని కాఫిటేరియా, కారిడ‌ర్ వ‌ద్ద వాళ్లు త‌మ‌ను తాము పేల్చుకున్నారు. పేలుళ్ల కోసం సీ-4 ఎక్స్‌పోజివ్స్‌ను వాడిన‌ట్లు తెలుస్తోంది. ఆ హోట‌ల్‌ను పేల్చేందుకు సుమారు 25 కిలోల బాంబులు వాడారు.

రూమ్‌లోకి ప్ర‌వేశించిన పోలీసులు అక్క‌డ నుంచి కొన్ని వ‌స్తువుల‌ను సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్ బాంబ‌ర్లు.. ఇస్లామిక్ తీవ్ర‌వాదులు అని విచార‌ణాధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అయితే వాళ్లు స్థానికులా లేక అంత‌ర్జాతీయ టూరిస్టులు అన్న విష‌యాన్ని మాత్రం ఇంకా పోలీసులు నిర్ధారించ‌లేదు.

మరోవైపు, బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు తీవ్ర ముప్పు పొంచివుందని నిగా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు భద్రతా చర్యలను చేపట్టారు. దీంతో సాధారణ సమయానికంటే నాలుగు గంటలు ముందుగానే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా పేర్కొన్నారు.

ఇంకోవైపు, ఉగ్రదాడులతో వణికిపోయిన శ్రీలంకలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల దర్యాప్తునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అలాగే, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారుదీనిపై మరింత చదవండి :