వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే.. భూమిపై ఇక మనుగడ సాగదు!
భూమిపై ఇకపై మానవ మనుగడ ఇంతకుముందులా సాగదని... కాబట్టి వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని చూసుకోవాలని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భూమికి అనేక సవాళ్లు
భూమిపై ఇకపై మానవ మనుగడ ఇంతకుముందులా సాగదని... కాబట్టి వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని చూసుకోవాలని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భూమికి అనేక సవాళ్లు రాబోతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు, ఆస్టరాయిడ్స్ దాడులు, విపరీతమైన కాలుష్యంతో మానవాళికి ఇబ్బందులు తప్పవని హాకింగ్స్ తెలిపారు. అణు, జీవ రసాయన యుద్ధాలు జరిగే ప్రమాదముందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి దీనిని నియంత్రించాలని సూచించారు.
బీబీసీ రూపొందిస్తున్న 'ఎక్స్‌పిడీషన్ న్యూ ఎర్త్' స్టీఫెన్ హాకింగ్స్ మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందేనని తెలిపారు. అంతరిక్షంలో మానవుడి మనుగడ గురించి తన శిష్యుడు క్రిస్టోఫీ గాల్‌ఫార్డ్, హాకింగ్స్ మధ్య జరిగిన చర్చను ఈ డాక్యుమెంటరీలో చూపారు. భూమి, దీని చుట్టూ ఉన్న వాతావరణానికి ఈ కాలం చెల్లిందని, మనుగడ కోసం మరో గ్రహాన్ని మానవుడు చూసుకోవాల్సిందేనని హాకింగ్స్ తెలిపారు.