శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (19:17 IST)

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 25మంది మృతి..

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది.

మార్కెట్ జరుగుతుండగా.. రద్దీలోని ప్రజలే లక్ష్యంగా పేలుడుకు పాల్పడినట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ బాంబు దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. సునీ, షిజా తెగలకు మధ్య జరుగుతున్న విబేధాలే ఈ దాడికి కారణమని అధికారులు చెప్తున్నారు. షిజా తెగకు చెందిన మసీదుకు దగ్గర్లోనే ఈ దాడి జరిగింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌కు సమీపంలో ఈ దాడి జరిగినట్లు భద్రతా దళ అధికారులు తెలిపారు.