శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (18:42 IST)

ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసిందా? హై అలెర్ట్..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన భారత సైనికులు జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రమూకల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసింది. ఉగ్రవాదుల మృత దేహాలకు అంత్యక్రియలు చేయకుండానే దా

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన భారత సైనికులు జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రమూకల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసింది. ఉగ్రవాదుల మృత దేహాలకు అంత్యక్రియలు చేయకుండానే దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ ఆర్మీ ఖనం చేసినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌లో మృతి చెందిన సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదుల మృతదేహాలను శుక్రవారం పాక్ ఆర్మీ రహస్యంగా ఖననం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇక మృతి చెందిన ఉగ్రవాదుల్లో జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వారని నిఘా వర్గాలు తెలిపాయి. 
 
ఇదిలా ఉంటే.. సర్జికల్ స్ట్రైక్ దాడులతో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉరీ దాడుల నేపథ్యంలో ఏ సమయంలోనైనా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉండటంతో ఇండియా యుద్ధ సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ యుద్ధ సామాగ్రిని కీలక ప్రాంతాలకు తరలిస్తున్నారు.