శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:39 IST)

పాకిస్తాన్‌లో గీతను గురించి అడిగి తెలుసుకున్న సుష్మాస్వరాజ్

చిన్న వయసులో తప్పిపోయి పాకిస్థాన్‌ చేరిన యువతి గీత గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆరా తీశారు. ఆమె స్థితిగతులపై కనుక్కోవాలని పాకిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. 
 
భారత రాయబారి రాఘవన్‌ను సతీసమేతంగా వెళ్లి ఆ యువతిని కలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 13 యేళ్ళ కిందట పాక్ లోని పంజాబ్ రేంజర్లకు గీత దొరికిన విషయం తెలిసిందే అప్పటి నుంచి గీత పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటోంది. 
 
మాటలు రాని గీత తన గ్రామం, తల్లిదండ్రులను గుర్తుపట్టి చెప్పలేక పోతోంది. అందుకే ఆ స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆమెను తిరిగి భారత్‌లోని స్వగ్రామానికి పంపే ప్రయత్నాలు చేస్తోంది.