ఇకపై తైవాన్‌లో స్వలింగ సంపర్క వివాహాలు
తైవాన్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహానికి సమ్మతం తెలిపింది. ఈ తరహా వివాహాలకు అనుమతినిచ్చిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
స్వలింగ సంసర్కులు వివాహం చేసుకోవడానికి చట్టపరమైన అనుమతి ఇస్తూ 2017లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. పార్లమెంట్‌కు రెండేళ్ల డెడ్‌లైన్ విధించారు. ఈనెల 24వ తేదీలోగా పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోదముద్రపడాల్సివుంది. అయితే, ఈ బిల్లుకు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాజధాని తైపీలో వేలాది మంది గే రైట్ మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.