ఆప్ఘన్ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజగా ఓ ఆప్ఘన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ జట్టులోని క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.
అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించడంతో తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది.
మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున ఆడింది పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఒకరు. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది.
ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జాలీ వెల్లడించింది. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.