ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (13:49 IST)

ఆప్ఘాన్‌ను ఆక్రమిస్తున్న తాలిబన్లు : ఎంఐ24 హెలికాఫ్టర్ స్వాధీనం

ఆప్ఘాన్ దేశంలో క్రమంగా తాలిబన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోంది. పాకిస్థాన్ సైన్యం అండతో తాలిబన్ తీవ్రవాదులు పెట్రేగిపోతున్నారు. ఫలితంగా మెల్ల‌గా మ‌ళ్లీ తాలిబ‌న్ల రాజ్యం వ‌స్తోంది. తాలిబ‌న్ ఫైట‌ర్లు దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఆఫ్ఘ‌నిస్థాన్ బ‌ల‌గాల‌కు భారత్ బహుమతిగా ఇచ్చిన Mi-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా తాము స్వాధీనం చేసుకున్న‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. ఈ హెలికాప్ట‌ర్ ప‌క్క‌న తాలిబ‌న్లు నిల‌బడి ఉన్న ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 
 
అయితే దీనికి ఉండాల్సిన రోటార్ బ్లేడ్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. తాలిబ‌న్లు దీనిని ఉప‌యోగించ‌కుండా ఉండేందుకు అంత‌కు ముందే ఆఫ్ఘ‌న్ బ‌ల‌గాలు వీటిని తొల‌గించిన‌ట్లు భావిస్తున్నారు.
 
2019లో ఈ Mi-24 అటాక్ హెలికాప్ట‌ర్‌ను ఇండియా ఆఫ్ఘ‌నిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చింది. దీంతోపాటు మూడు చీతా లైట్ యుటిలిటీ హెలికాప్ట‌ర్ల‌ను కూడా ఇచ్చింది. 2015లోనూ ఇలాగే నాలుగు అటాక్ హెలికాప్ట‌ర్ల‌ను ఇవ్వ‌గా.. ఈ Mi-24ను కూడా అందులో చేర్చింది.