తమిళ దర్శకుడి క్రూరత్వం.. భార్యను చంపి ముక్కలు చేసింది ఎందుకో తెలుసా?

murder
Last Updated: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (09:04 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు కట్టుకున్న భార్యను చంపి ముక్కలు చేసి.. ఆ ముక్కలను నగరంలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. కొన్ని అడయార్ మురుగునీటి కాలువలో, మరికొన్ని చెత్త యార్డులు, ఇంకొన్ని చెత్త తొట్టిలో విసిరేశాడు. తన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆ డైరెక్టర్ పేరు బాలకృష్ణన్. ఈ కేసులో చెన్నై నగర పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, హత్యకు ఎలా చేశాడో పూసగుచ్చినట్టు వివరించాడు.

తూత్తుక్కుడికి చెందిన బాలకృష్ణన్ చెన్నైకు వచ్చి కోలీవుడ్ ఇండస్ట్రీలో సినీ దర్శకుడుగా కొనసాగుతున్నాడు. ఈయన సంధ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈయన దర్శకత్వంలో 'కాదల్ ఇలవశం' (ప్రేమ ఉచితం) అనే పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణన్ ఇంటికి అనేక మంది సెలెబ్రిటీలు, ఫైనాన్షియర్లు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలూ వచ్చి వెళ్లేవారు. సంధ్యకు కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న బలమైన కోరిక ఉండటంతో.. ఇంటికి వచ్చే వారితో చాలా చనువుగా ఉండేది. దీన్ని చూసిన బాలకృష్ణన్ తట్టుకోలేక పోయాడు. ఇదే విషయంపై భార్యను పలుమార్లు హెచ్చరించాడు.

తను లేనప్పుడు ఇంట్లో ఏదో జరుగుతోందని లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. పైగా, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మాడు. ఈ విషయమై చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిసింది. దీంతో అనుమానం మరింతగా బలపడటంతో పాటు ఆయనలో ఓపిక నశించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడించాడు.

భార్యను తమ ఇంట్లోనే నరికి చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ ముక్కలను కారులో తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేశాడు. ఆ చెత్తకుప్పలన్నీ పెరుంగుడి డంపింగ్ యార్డుకి చేరాయి. అక్కడ జనవరి 21న మొదట ఓ చెయ్యి కనిపించింది. తర్వాత రెండో చెయ్యి, రెండు కాళ్లూ కనిపించాయి. ఆ తర్వాత మిగతా పార్టులూ కనిపించాయి. కానీ మొహం పచ్చడై ఉండటంతో... ఆ మహిళ ఎవరన్నది పోలీసులు వెంటనే కనిపెట్టలేకపోయారు. అయితే, సంధ్య చేతిపై ఉన్న ఓ టాటూ ఆధారంగా చనిపోయింది సంధ్య అని కనిపెట్టేందుకు రెండు వారాలు పట్టింది. చివరకు బాలకృష్ణన్ చేసిన నిర్వాకాన్ని కనిపెట్టారు. అతన్ని అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :