మాస్క్ పెట్టుకోలేదని ప్రధానికి ఫైన్... ఎక్కడ..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది.
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్‌కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించి ఉండగా ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.
ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతడికి జరిమానా విధించారు అధికారులు. ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్ నగర గవర్నర్ అశ్విన్ క్వాన్‌మువాంగ్ స్పందించారు. ప్రధానిని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.