అవెంజర్స్ విలన్ థానోస్ అవతారమెత్తిన డొనాల్డ్ ట్రంప్ (వీడియో వైరల్)

సెల్వి| Last Updated: గురువారం, 12 డిశెంబరు 2019 (11:26 IST)
రిపబ్లికన్ పార్టీని దెబ్బిపొడిచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హాలీవుడ్ సినిమా విలన్ అయిన తానోస్‌లా చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా అధినేత ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షుడు జో బిటెన్‌పై ఉక్రెయిన్‌లో విచారణ జరపాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌పై డెమోక్రటిక్ పార్టీ గుర్రుగా వుంది. అంతేగాకుండా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలైంది. ట్రంప్ వార్ రూమ్ అనే ట్రంప్ వ్యతిరేక బృందం.. ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ట్రంప్ అవెంజర్స్ సినిమా విలన్ థానోస్‌ల కనిపించాడు.

ఆ సినిమాలో థానోస్ ఇన్ఫినిటి రాక్స్‌ను ధరించి చిటికేసి ప్రపంచంలోని సగం జనాన్ని నశింప చేస్తాడు. అదే పాత్రలో ట్రంప్ చిటికేసే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రంప్ చిటికేసిన వెంటనే డెమోక్రటిక్ పార్టీ సభ్యులు విచారణ లేకుండా తప్పుకున్నట్లు వుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ వీడియోను మీరూ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :