శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:13 IST)

బ్రిటన్ ప్రధాని క్షేమం...ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

కరోనా వైరస్ తో విలవిల్లాడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌  క్షేమంగా బయటపడ్డారు. ఆయన నుంచి ఆస్పత్రి డిశ్చార్జ్‌ అయ్యారు.

గత ఆదివారం నుంచి ఆయన సెయింట్ థామస్ హాస్పిటల్‌లో ఐసీయూలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు బోరిస్‌  బకింగ్‌హామ్‌షైర్ నివాసంలో  విశ్రాంతి తీసుకుంటారని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కోవిడ్‌-19లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్‌ 5న ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్ అందించారు. పరిస్థితి మెరుగుపడటంతో జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు.

సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన  నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్‌ పేర్కొన్నారు.