1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (20:12 IST)

ఆకాశం నుంచి కరెన్సీ నోట్లు వర్షం... దుబాయ్‌లో అంతే దుబాయ్‌లో అంతే...

ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. 
 
రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు రయ్యమని దూసుకొస్తున్నా అదేమీ పట్టనట్లు కాసుల కోసం పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్ జాం అయింది. ఆకాశం నుంచి 500 దినార్ల(దుబాయ్ కరెన్సీ) నోట్లు అంతా కలిపి సుమారు రూ. 4.81 కోట్లు ఉండవచ్చని అంటున్నారు. ఇంతకీ ఈ నోట్ల వర్షం ఎందుకు కురిసిందీ, ఎక్కడ నుంచి ఇవి వచ్చి పడ్డాయనేది ఇంకా తెలియరాలేదు మరి.