శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (12:43 IST)

డొనాల్డ్ ట్రంప్‌తో తీసుకున్న సెల్ఫీతో.. కొంప కొల్లేరు.. విడాకులకు రెడీ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అభిమాని కాపురంలో చిచ్చు రేగేందుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన డేవ్, లిన్‌ల వివాహం 2016లో జరిగింది. లిన్ ఒకప్పుడు అమెరికన్ ఫుట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అభిమాని కాపురంలో చిచ్చు రేగేందుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన డేవ్, లిన్‌ల వివాహం 2016లో జరిగింది. లిన్ ఒకప్పుడు అమెరికన్ ఫుట్‌బాల్ జట్టు మయామి డాల్ఫిన్స్‌కు చీర్ లీడర్‌గా పనిచేసింది. ఆమె భర్త డేవ్‌ పామ్‌ బీచ్‌ కౌంటీకి అటార్నీగా వ్యవహరిస్తున్నాడు. ఇక లిన్ డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని. తన పెంపుడు కుక్కకు ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ పేరు పెట్టుకుంది. 
 
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లిన్‌ అగ్రరాజ్య అధ్యక్షుడితో పలుమార్లు సెల్ఫీలు దిగింది. అది ఆమె భర్తకు నచ్చలేదు. దాంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటుండేవి. ఈ నేపథ్యంలో లిన్‌ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన భర్తతో విడిపోయేందుకు అధ్యక్షుడు ట్రంపే కారణమని లిన్ చెప్పింది. అంతేకాదు.. ట్రంప్‌పై అభిమానంతో సెల్ఫీ దిగడంతోనే తన కాపురం కూలిపోయిందని లిన్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.