శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:58 IST)

ట్రంప్‌కు బ్రిటీష్ పార్లమెంట్‌లో అవమానం.. రేసిజం-సెక్సిజం‌కు వ్యతిరేకం.. మాట్లాడేందుకు వీల్లేదు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటీష్ పార్లమెంట్‌లో అవమానం జరిగింది. ఆ దేశ పార్లమెంట్ ట్రంప్‌కు గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లోని వెస్ట్ మినిస్టర్ హాలులో డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ఎంపీలను ఉద

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటీష్ పార్లమెంట్‌లో అవమానం జరిగింది. ఆ దేశ పార్లమెంట్ ట్రంప్‌కు గట్టి షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లోని వెస్ట్ మినిస్టర్ హాలులో డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించాల్సింది. 2015 నవంబరులో ప్రధాని మోదీ, అంతకు ముందు 2012 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ హాల్లో ప్రసంగించారు. కానీ డొనాల్డ్ ట్రంప్‌కు ఆ అవకాశం లభించలేదు. ట్రంప్‌ను ఆయన్ని ఆహ్వానించేందుకు తాము నిరాకరిస్తున్నామని.. ప్రసంగం చేయడానికి ఆయన అనర్హుడని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో అన్నారు. 
 
డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న జాతి వివక్ష (రేసిజం), సెక్సిజం (అసభ్య) ధోరణులను తమ సభ వ్యతిరేకిస్తోందని బెర్కో స్పష్టం చేశారు. ఇంకా బెర్కో మాట్లాడుతూ.. ట్రంప్ మా దేశానికి రావొచ్చుకానీ.. సభలో మాట్లాడేందుకు మాత్రం వీల్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిజానికి వెస్ట్ మినిస్టర్ హాలులో ప్రసంగించడం అంటే అదో ప్రత్యేక గౌరవం. కానీ ట్రంప్ ఈ గౌరవాన్ని దక్కించుకోలేకపోయారు. అటు స్పీకర్ ప్రకటనను అనేకమంది ఎంపీలు ప్రశంసించగా, కొందరు మంత్రులు మాత్రం అంతర్గతంగా.. స్పీకర్ తన పరిధిని దాటి వ్యవహరించినట్టు కనిపిస్తోందని చెవులు కొరుక్కున్నారు.