Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:07 IST)

Widgets Magazine
donald trump

అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఫ్లొరిడాలోని టాంపాలో మాక్ డ్రిల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను సందర్శించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. 
 
అమెరికాకు మచ్చ తెచ్చిన 9/11 ఘటనను మర్చిపోలేమని, బోస్టన్, ఓర్లాండో, సాన్ బెర్నార్డినో, సహా ఐరోపా దేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసినట్లు గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడుతున్నారని, వారిని మట్టుబెట్టేందుకు అమెరికా మిలటరీలో పెద్ద మొత్తంలో ఆర్థిక పెట్టుబడులు పెడతామన్నారు.
 
మధ్య ప్రాచ్య దేశాలు, మధ్య ఆసియాలో కూడా తీవ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ‘కచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. అంతేకాదు, అది అమెరికాలో వేళ్లూనుకోకుండా చర్యలు తీసుకుంటాం. అదే  సమయంలో స్వేచ్ఛ, భద్రత, న్యాయాన్ని కాపాడుతామని ట్రంప్ పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Isis America Donald Trump Forces Of Death

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ ఓ నిశాని... ప్రజలు ఎన్నుకున్న వారే పరిపాలించాలి: దీప

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి ...

news

జయలలిత మరణం వెనుక కుట్ర... వైద్యుల ప్రెస్‌మీట్‌లో పొంతనలేని సమాధానాలు?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంలో కుట్ర ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ...

news

వేల మైళ్లనుంచి కలుస్తున్న బంధాలు: ఆ విమానాశ్రయాల్లో అపురూప దృశ్యాలు

అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో అద్భుతమైన దృశ్యాలు స్పందించే హృదయాలను తట్టి లేపుతున్నాయి. ...

news

శశికళ కలలు గల్లంతేనా.. గవర్నర్ మెలికతో ప్రమాణ స్వీకారం వాయిదా..!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికల ఆశల సౌధానికి గండి పడే సూచనలు కనిపస్తున్నాయి. ...

Widgets Magazine