భారత్‌తో పాటు 14 దేశాల ప్రయాణికులపై యూఏఈ నిషేధం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తితో పాటు... కొత్త వేరియింట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో భారతదేశంతో సహా 14 దేశాల ప్రయాణికుల రాకపోకలపై యూఏఈ నిషేధం విధించింది.
ఇతర దేశాల కంటే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమస్యను ప్రపంచంలోని పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. జులై 21 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని యూఏఈ తెలిపింది.