Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రిటీష్ మోడల్‌ కిడ్నాప్ కేసు: అమ్మేయాలనుకుంటే.. అది అడ్డుపడింది.. ఏంటది?

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (11:26 IST)

Widgets Magazine
victim woman

బ్రిటీష్ మోడల్‌ను కిడ్నాప్ చేసి సెక్స్ బానిసగా అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఇటలీలో ఫోటో షూట్‌కు వెళ్లిన ఓ 20 ఏళ్ల మోడల్‌ను బంధించి డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అయితే కిడ్నాప్ నుంచి మోడల్‌ను కాపాడామని ఇటలీ అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. మిలన్ ప్రాంతంలో చోలీ బలింగ్ అనే 20 సంవత్సరాల యువతిని గత వేసవిలో లూకాజ్ పావెల్ హెర్బా (30) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆమెను ఆన్‌లైన్‌లో అమ్మేయాలని ఆ వ్యక్తి భావించాడు. 
 
కానీ ఆమెకు రెండేళ్ల కుమారడు వున్నాడని తెలుసుకుని.. మిలన్‌లోని బ్రిటీష్ కాన్సులేట్ ముందు విడిచిపెట్టారని చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ.. తనను బలవంతంగా లాక్కెళ్లి... మత్తుమందిచ్చి ఓ బ్యాగులో కుక్కారని.. తనకు మెలకువ వచ్చేసరికి కాళ్లూ చేతులూ కట్టేసున్నాయని.. ఓ బ్యాగులో ఉన్నానని, కారు డిక్కీలో ప్రయాణిస్తున్నాననే విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది.
 
ఆపై ఓ ఫామ్ హౌస్‌లో ఏడు రోజుల పాటు తనకు నరకం చూపించారని.. మళ్లీ కుటుంబాన్ని చూస్తానని భావించలేదని తెలిపింది. చివరికి తనకు రెండేళ్ల కుమారుడు వున్నాడని తెలుసుకుని.. వ్యాపారానికి పనికిరానని భావించి వదిలేశారని వెల్లడించింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జూలై 17న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు న్యాయమూర్తి కోర్టులో అధికారులు వివరించారు. ఈ కేసు విచారణ బుధవారం ఇటలీ కోర్టులో విచారణ జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీలో బంద్ ప్రభావం : స్తంభించిన ప్రజారవాణా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ...

news

అరుణ్ జైట్లీని అటాడుకోండి : ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగినన్ని నిధులు కేటాయించకుండా మోసం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి ...

news

అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా...

డెంగీ జ్వరం కారణంగా చనిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు గాలి ...

news

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?

''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ ...

Widgets Magazine