గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:57 IST)

ఉక్రెయిన్ విమానం హైజాక్.. ఇరాన్‌కు దారి మళ్లింపు

తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానం ఒకటి హైజాక్ అయింది. ఈ విమానాన్ని ఇరాన్ వైపునకు మళ్లించారు. 
 
తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో మంగళవారం ఉక్రెయిన్‌ ప్రభుత్వం అఫ్గనిస్థాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో హైజకర్లు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్‌ చేసి ఇరాన్‌కు మళ్లించారు. 
 
ఈ విమానం హైజాక్‌ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్‌ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు.