ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం.. 137 మంది మృతి.. వందలాది మందికి గాయాలు
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాలో రెండో రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా. ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.
ఇప్పటివరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా, ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్ పౌరులు మృతిచెందినట్టు చెప్తున్నారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
రష్యా భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ బలగాలు, సైనిక సమీకరణకు జెలెన్స్కీ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 90 రోజుల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. గత కొంతకాలంగా ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.