శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:51 IST)

'హోప్' పంపిన అమూల్య చిత్రం...

అంగారక గ్రహంపైకి యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)తొలి ఉపగ్రహాన్ని పంపంది. దీనిపేరు 'హోప్/అమల్​​'. ఇది అరుణ గ్రహానికి సంబంధించి ఫోటోని పంపించింది. ఈ మేరకు యూఏఈ ఆ చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో అరుణ గ్రహ ఉత్తర ధ్రువం, అక్కడి అతిపెద్ద అగ్నిపర్వతం 'ఒలింపస్‌ మాన్స్‌' దర్శనమిస్తున్నాయి.
 
గత యేడాది జూలైలో జపాన్​ అంతరిక్ష కేంద్రం నుంచి యూఏఈ హోప్​ ఉపగ్రహాన్ని అంగారకుని మీదుకు విజయవంతంగా పంపించగా, ఏడు నెలలు అంతరిక్షంలో ప్రయాణించిన హోప్​ మంగళవారం (ఫిబ్రవరి 9న) అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. యూఏఈ.. మార్స్​పైకి పంపించిన ఈ ఉపగ్రహంతో అరబ్​ ప్రపంచంలో ఒక నూతన శకాన్ని ప్రారంభించింది.