శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (18:57 IST)

ప్రేమికుల రోజు: గజరాజు ప్రేమ విఫలం.. తన సహచరి వేరొక ఏనుగుతో..?

ప్రేమికుల రోజున ఓ ఏనుగుకు ప్రేమ విఫలమైంది. తన సహచరి తనను వదిలేసి ఇంకో ఏనుగుతో వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ ఏనుగుకు కోపమొచ్చింది. అంతే రోడ్డెక్కింది.. కార్లను ఓ ఆటాడుకుంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. తన సహచరి తనకు దూరమైందనే వేదనతో రోడ్డెక్కిన ఏనుగు పార్క్ చేసిన 15 కార్లను తన్ని పడేసింది. అయితే అంత కోపంలోనూ అక్కడే నిలుచుని ఫోటీలు, వీడియోలు తీసుకుంటున్న కార్ల యజమానులు, పర్యాటకులను ఆ ఏనుగు ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే చైనాలోని గ్జిషువాంగ్ బన్నా ప్రిఫెక్చర్ నేచర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. వారం క్రితం ఈ ఏనుగుతో సహజీవనం చేసిన ఏనుగు, మధ్యలో వచ్చిన వేరొక ఏనుగుతో కలిసి వెళ్ళిపోయిందన్నారు. దీంతో గజరాజు కోపానికి కార్లు బలైయ్యాయని చెప్పారు. దెబ్బతిన్న కార్ల యజమానులకు అటవీ శాఖాధికారులు నష్టపరిహారం చెల్లించారు.