శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (23:16 IST)

పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి.. ఏమైందంటే?

జన్యుమార్పిడితో పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న డేవిడ్ బెన్నెట్, 57 అనే వ్యక్తికి జనవరి 7న పంది గుండెను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత రెండు నెలలు జీవించాడు. పంది గుండెను అమర్చినా అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతని కుటుంబానికి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ బార్ట్లీ పి. గ్రిఫిత్ అన్నారు. మిస్టర్ బెన్నెట్ తన ధైర్యం, జీవించాలనే దృఢ సంకల్పం కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలచే ప్రశంసలు పొందాడు.  
 
శస్త్రచికిత్స తర్వాత, మార్పిడి చేయబడిన గుండె చాలా వారాలపాటు ఎటువంటి తిరస్కరణ సంకేతాలు లేకుండా చాలా బాగా పనిచేసింది. బెన్నెట్ తన కుటుంబంతో సమయాన్ని వెచ్చించగలిగాడు. బలాన్ని తిరిగి పొందేందుకు శారీరక చికిత్సలో పాల్గొనగలిగాడు. కానీ అనారోగ్యం కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు.