Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యుద్ధ మేఘాలు : ఉత్తర కొరియాపై దాడికి కదిలిన యుఎస్ వార్ షిప్?

శుక్రవారం, 19 మే 2017 (10:09 IST)

Widgets Magazine
us aircraft carrier

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార చర్యలను ఏమాత్రం సహించజాలని అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశంపై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంకేతాలను నిజం చేసేలా మిత్రదేశం దక్షిణ కొరియా సముద్ర ప్రాదేశిక సముద్ర జలాల్లోకి యుద్ధ నౌకను అమెరికా తరలిస్తోంది. దీంతో అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
గత నెల 5వ తేదీన బాలిస్టిక్ అణు క్షిపణిని పరీక్షించడం, ఆపై అమెరికాను రెచ్చగొడుతూ దాడి చేస్తామని హెచ్చరించడం, తాజాగా ఉత్తర కొరియా వైపు దూసుకొస్తున్న యుద్ధనౌకలు... ఈ పరిణామాలు చూస్తుంటే, యుద్ధం అనివార్యమని అనిపిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు.
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఉన్‌కు షాకిచ్చేలా యూఎస్ వార్‌షిప్‌లలో అత్యంత కీలకమైన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్‌ను కూడా ఉత్తర కొరియా సముద్ర జలాల్లోకి అమెరికా పంపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ కార్ల్ విల్సన్ దక్షిణ కొరియాకు దగ్గరగా ఉండగా, ఇప్పుడు దానికి తోడుగా మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. ఈ రెండూ కలసి యుద్ధ విన్యాసాలు చేయనున్నాయని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు ...

news

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ...

news

నిషిత్ కారు ప్రమాదం: ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి?... బెంజ్ ప్రతినిధులు ఏమంటున్నారు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ...

news

ప్రేమ వలలో పడి పిండాన్ని మోసింది.. గర్భస్రావం కోసం రక్తం ఎక్కించారు.. వికటించి చనిపోయింది..

ప్రేమికుడిని నమ్మి మోసపోయింది. పిండాన్ని కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్తే ...

Widgets Magazine