గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

వ్యాన్‌తో జనాలపైకి ఎక్కించిన ఐసిస్... రక్తమోడిన రహదారులు...

స్పెయిన్‌ దేశంలోని ప్రధాన పట్టణమైన బార్సిలోనాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఫలితంగా స్పెయిన్ రహదారులు రక్తమోడాయి. బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(ఐఎ

స్పెయిన్‌ దేశంలోని ప్రధాన పట్టణమైన బార్సిలోనాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఫలితంగా స్పెయిన్ రహదారులు రక్తమోడాయి. బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(ఐఎస్ఐఎస్‌) వ్యాన్‌తో పాదాచారులను ఢీకొట్టారు. దీంతో అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ రహదారి ఆర్తనాదాలు, ఉరుకులు పరుగులు, ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
కాగా, ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి పోలీసులు కాల్చి చంపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనే ప్రణాళిక రచించారని, ఒక వ్యక్తి దాడికి పాల్పడగా, రెండో వ్యక్తిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడి తమ ఉగ్రవాదులే చేశారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.  
 
నిజానికి ఉగ్రవాదులు ఇపుడు పంథా మార్చారు. నిన్నమొన్నటివరకు బాంబులు, తుపాకులతో దాడులు చేసే ఉగ్రమూకలు.. ఇపుడు వ్యూహం మార్చారు. భారీ వాహనాలనే మారణాయుధాలుగా ఎంచుకుంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై వాహనాలతో స్వైరవిహారం చేస్తూ పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటున్నారు. అలాంటిదే ఇపుడు జరిగిన ఉగ్రదాడి.