శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:02 IST)

వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా : పుతిన్ వెల్లడి

ఉక్రెయిన్‌ - రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను తగ్గించేందుకు రష్యా అధినేత వ్లాదిమిరి పుతిన్ సరికొత్త వ్యూహాన్ని రచించారు. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలకు (తూర్పు ఉక్రెయిన్) స్వతంత్ర హోదాను కల్పిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని తెలిపారు. 
 
ఆ రాష్ట్రాలకు అవసరమైన సైనిక సహకారాన్ని తమ దేశం అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఈ ప్రాంతానికి చెందిన వేర్పాటువాద నాయకులతో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జాతినుద్దేశించి పుతిన్ చేసిన కీలక ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
"ఉక్రెయిన్ దేశాన్ని బయటి శక్తులు నియంత్రిస్తూ తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నాయి. ఇతర శక్తుల ద్వారా మమ్మల్ని నియంత్రించాలని అనుకుంటున్నాయి. అమెరికా రాయబార కార్యాలయం కీవ్‌లో కోట్లు కుమ్మరిస్తున్నది. ఉక్రెయిన్ పాఠశాలల్లో రష్యన్ బాషను తొలగించారు. ఉక్రెయిన్ కేవలం తమ పొరుగు దేశం మాత్రమే కాదని అది రష్యా చరిత్రలో భాగం" అని పుతిన్ గుర్తుచేశారు.