శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (18:31 IST)

టాయిలెట్‌లో కోబ్రా: మహిళ వచ్చింది.. పామును పట్టుకెళ్లింది..(video)

Snake
Snake
టాయిలెట్‌లో ఓ పాము కనిపించింది. అంతే ఆ ఇంటి యజమాని జడుసుకుని పాములు పట్టే వారికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చేంతవరకు భయంతో వణికిపోయాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ హెర్వీ బేలో వున్న ఆ వ్యక్తి ఇంటి టాయిలెట్‌లో భారీ పాము దూరింది. దీంతో ఆ వ్యక్తి వెంటనే అటవీ శాఖకు చెందిన అధికారులకు సమాచారం అందించాడు.
 
ఆపై పాములను బంధించే బృందం నుంచి ఓ మహిళ అక్కడకు వచ్చి ఆ పామును పట్టుకుంది. ఆ తర్వాత దానిని నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పెట్టింది. ఈ పాము విషపూరితం కాదని.. పెను ప్రమాదం తప్పింది.