శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (09:47 IST)

అణ్వాయుధాలను ఎపుడైనా ప్రయోగిస్తాం : పాకిస్థాన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్యను పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత్‌పై లేనిపోని నిందలు మోపుతోంది. పైగా, యుద్ధం చేస్తామంటూ భీకరాలు పలుకుతోంది. ముఖ్యంగా, యుద్ధం అనేది వస్తే భారత్‌పై తాము తొలుత అణ్వాయుధాలను ప్రయోగించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 
 
ఆయన అలా వ్యాఖ్యానించి రెండు రోజులు కూడా కాకముందే ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ పరస్పర విరుద్ధ ప్రకటన చేశారు. అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదన్న నియమమేమీ తమ వద్ద లేదన్నారు. అణ్వాయుధాలను తామైతే తొలుత ప్రయోగించబోమన్న భారత రక్షణ మంత్రి రాజ్‌సింగ్ వ్యాఖ్యలపై గఫూర్ మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 
 
'అణ్వాయుధాలను తొలుత ప్రయోగించబోమన్న రూల్సేమీ మేము పెట్టుకోలేదు' అని గఫూర్ స్పష్టం చేశారు. దాడి అనేది మొదలైతే ఒకదాని వెంట మరొకటి జరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అణ్వస్త్ర దేశాలకు యుద్ధం కోసం ప్రత్యేకంగా ఓ స్థలం ఉండదని గఫూర్ వెల్లడించారు.