ప్రేయసి, నలుగురు పిల్లలను పుతిన్ ఎక్కడ దాచారో?
రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబాన్ని సురక్షితమైన ప్రదేశంలో వుంచారని తెలుస్తోంది. తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని పుతిన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో వుంచినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తన కుటుంబాన్ని సురక్షితంగా అణుబంకర్లలో పుతిన్ దాచినట్లు సమాచారం.
స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తన ప్రేయసి, ఒలింపిక్స్‌లో స్వర్ణం కూడా సాధించిన జిమ్నాస్ట్ అలీనా కబయేవాను, తమకు పుట్టిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారట. వారిని అత్యంత భద్రమైన, గోప్యమైన ప్రాంతంలో ఉంచినట్టు సమాచారం.