గబ్బిలాల నుంచి జంతువులు.. ఆపై మనుషులకు.. కరోనా వైరస్ వ్యాప్తి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ నగరంలోని ఓ పరిశోధనాశాల నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. దీనిపై చైనాతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పరిశోధన చేపట్టాయి. ఈ పరిశోధనలో గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది.
ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ అని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. అయితే ఈ రిపోర్టు ముందుగా ఊహించినట్లే ఉండటం గమనార్హం. ఇందులో చాలా ప్రశ్నలకు అసలు సమాధానాలే లేవు. ఇప్పుడు కూడా ల్యాబ్ లీక్ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలపై మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్త నివేదిక చెప్పడం గమనార్హం.
గత జనవరిలోనే చైనాకు వెళ్లి కరోనా మూలాలను పరిశీలించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం. అయితే నివేదికను మాత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రపంచమంతా ఈ మహమ్మారికి చైనాను బాధ్యురాలిని చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్టును చైనా మారుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నిజానికి కరోనా విషయంలో మొదటి నుంచీ డబ్ల్యూహెడ్‌వోది చైనా అనుకూల ధోరణిగానే ఉంది. జెనీవాలో ఉన్న ఓ దౌత్యవేత్త ద్వారా ఈ ముసాయిదా రిపోర్టును ప్రముఖ ఏజెన్సీ అసోసియేటెడ్ ఏజెన్సీ సంపాదించింది. దీనిని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే అందకు ముందే ఇందులో ఏమైనా మార్పులు చేస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.