1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (10:15 IST)

మాంసాహారాన్ని తొలిసారి టేస్ట్ చేసిన మహిళ.. 22 ఏళ్లుగా శాకాహారి.. నూనెలో వేయించిన ముక్కల్ని?

స్థూలకాయం మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా వస్తుందని వైద్యులు అంటూ వుంటారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదని.. అలా తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని వారు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాలుగా శా

స్థూలకాయం మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా వస్తుందని వైద్యులు అంటూ వుంటారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదని.. అలా తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని వారు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాలుగా శాకాహారం తీసుకున్న మహిళ తొలిసారిగా మాంసాన్ని రుచిచూసింది. ఈ ఉదంతం అమెరికాలోని చికాగోలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చికాగో నగరానికి చెందిన స్టెఫానీ పోటకీస్ అనే మహిళ 22 ఏళ్లుగా శాకాహారిగానే ఉంది. శాకాహారం తిని తిని మొహం మొత్తిన సదరు మహిళ ఓ రోజు మాంసం తినాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న సూపర్ క్లబ్ బృందం స్టెఫానీ ఫోటకీస్‌ను చికాగోలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్టేక్ హౌస్ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి అక్కడి ఆమెకు వివిధ రకాల మాంసాహార పదార్థాలను వండి పెట్టారు.
 
ఆయిల్‌లో వేయించిన మాంసపు ముక్కలను ఫోర్క్ సాయంతో తింటూ లొట్టలేసిన స్టెఫానీ మాంసాహారం గురించి గొప్పలు చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది.