శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:37 IST)

పెళ్లి ప్రపోజల్.. గంతేసిన ప్రియురాలు.. కొండపై నుంచి పడి..!

తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. వివరాల్లోకెళితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. 
 
కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను దిమిత్రోవాకు చెప్పాలని భావించి, ఆమెను ఆహ్వానించాడు. 
 
ఇద్దరూ కలిసి ఓ కొండపైకి నడిచారు. అక్కడ తన ప్రియురాలికి విషయం చెప్పేశాడు. "అనుమతిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా" అని చెప్పడంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. అయితే, వారున్నది కొండ అంచున కావడంతో దిమిత్రోవా అదుపుతప్పి కిందికి పడిపోయింది. దీంతో, తీవ్రగాయాలపాలై మృతి చెందింది.