గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (18:29 IST)

నా భర్తకు 47 మంది పిల్లలు.. విడాకులు ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఏం చేయాలి?

ఆమె భర్తకు 47 మంది పిల్లలు. ఆ విషయం తెలుసుకున్న భార్య వాపోయింది. అసలు సంగతి ఏంటంటే.. అతడు సంతానం కోసం పరితపిస్తున్న మహిళల కోరిక మేరకు వీర్య దానం ద్వారా 47 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఈ విషయాన్ని అతడి భార్య జీర్ణించుకోలేకపోతోంది. ఇటీవల ఓ మహిళ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టి తన గోడు వెళ్లబోసుకుంది.
 
ఈ మేరకు ''మాకు పెళ్లయ్యి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. మాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. మేమిద్దరం కొన్నాళ్లు డేటింగ్‌ చేశాం. అప్పుడే అతడు తాను వీర్య దాతనని తెలిపాడు. కానీ, ఎంతమందికి వీర్యదానం చేశాడనే విషయాన్ని చెప్పలేదు. సాధారణంగా ఒకరు లేదా ఇద్దరికి సాయం చేసి ఉంటాడని భావించాను. ఇక చేసింది చాలు.. ఎవరికీ వీర్యం ఇవ్వకని కూడా అప్పట్లో చెప్పాను. కొద్ది రోజుల కిందట మాటల్లో భాగంగా మీరు ఎంతమందికి వీర్యదానం చేశారని అడిగాను. ఇందుకు అతడు 47 మందికని చెప్పాడు. అంతే, నాకు గుండె ఆగినంత పనైంది'' అని తెలిపింది. 
 
ఆ సమాధానం వినగానే.. పెళ్లికి ముందే ఈ విషయం తెలుసుకుని ఉంటే ఇంత బాధపడాల్సి వచ్చేది కాదనిపించింది. ఎందుకంటే.. భవిష్యత్తులో ఆ పిల్లలకు 18 ఏళ్లు నిండుతాయి. వారంతా డీఎన్‌ఏ ద్వారా నువ్వే నా తండ్రివని ఇంటికి వస్తారు. మా జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా భర్తకు విడాకులు ఇవ్వాలా? కలిసి ఉండాలా? '' అని ప్రశ్నించింది.