Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఐదో అంతస్థు నుంచి దూకేసింది.. (వీడియో)

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:30 IST)

Widgets Magazine

పురిటినొప్పులను తట్టుకోలేక సిజేరియన్ చేయాల్సిందిగా వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆమె సిజేరియన్ చేసుకునేందుకు ఒప్పుకోలేదు. చైనా చట్టాల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి లేనిదే సిజేరియన్ చేయకూడదు. దీంతో పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఆ తొమ్మిదినెలల గర్భవతి.. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయమని వేడుకుంది. కానీ సిజేరియన్‌కు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. ఆమె ఆస్పత్రి ఐదో అంతస్థు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇక కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. తనకు సిజేరియన్ చేయాల్సిందిగా తల్లిదండ్రుల కాళ్లమీద పడి ఆ గర్భవతి వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనాయి. 41 వారాల గర్భవతి అయిన ఆ మహిళ కడుపులో పెరుగుతున్న పిల్లవాడి తల చాలా పెద్దగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆమెకు సిజేరియన్ ఆపరేషనే చేయాలి. చైనా చట్టాల ప్రకారం కుటుంబసభ్యుల అనుమతి లేకుండా సిజేరియన్ చేయరు. 
 
తల్లిదండ్రులు రాగానే ఆమె వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శాంగ్జి ప్రావిన్స్‌లోని ఓ పేరుమోసిన ఆసుపత్రిలో చోటుచేసుకుంది. చైనా చట్టాల వల్లే గర్భవతి చనిపోయిందని నెటిజన్లు పైర్ అవుతున్నారు. అయితే మీడియా మాత్రం ఆమెది ఆత్మహత్యగా చూపెట్టింది. ఈ బాధను తట్టుకోలేక గర్భవతి తల్లిదండ్రుల కాళ్లపై ఎలా పడి వేడుకుందో మీరూ వీడియోలో చూడండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేరా బాబా గోడలతో మాట్లాడుతున్నాడు.. కారణం శృంగారానికి?

డేరా బాబా ఆశ్రమంలో సోదాలు ముగిసినట్లు పౌరసంబంధాల శాఖ హర్యానా డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ ...

news

స్వైన్‌ ఫ్లూ వైరస్‌కు వరంగల్ ఏసీపీ మృతి

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు ...

news

తీరం దాటిన ఇర్మా... ధ్వంసమైన జైలు.. పారిపోయిన ఖైదీలు..

క‌రీబియ‌న్ దీవులు, క్యూబాను ముంచెత్తిన హ‌రికేన్ ఇర్మా.. ఇక అమెరికాలోని ఫ్లోరిడాలోని కీస్ ...

news

పాపాల చిట్టాగా డేరా బాబా ఆశ్రమం.. లొంగదీసుకుంటాడు.. అబార్షన్ చేయిస్తాడు..

డేరా బాబా పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో జరిపిన ...

Widgets Magazine