వామ్మో... ప్రియుడిని చంపేసి ముక్కలు చేసి ఉడికించేసింది...

murder1
కుమార్ దళవాయి| Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:26 IST)
ఒక మహిళ తన ప్రియుడిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించేసింది. అయితే ఈ సంఘటన మన దేశంలో కాదు దుబాయ్‌లో జరిగింది.

మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారితో విడిపోయిన మహిళ పదేళ్ల నుండి దుబాయ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో మొరాకోకే చెందిన 29 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారి వారు సహజీవనం చేసుకునే వరకు వెళ్లింది.

ఇటీవలే ఆ వ్యక్తికి ఆ మహిళకు వివాహమైందన్న విషయం తెలిసింది. అప్పటి నుండి తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హఠాత్తుగా ఒక రోజు ఆ మహిళ అతనిని చంపేసి, శవాన్ని ఏమి చెయ్యాలో తెలీక ముక్కలు ముక్కలుగా కోసింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి దుర్వాసన వచ్చి అడుగగా ఎండుచేపలు కొన్నానని, అవి పాడైపోయాయని చెప్పింది. ఆ తర్వాత ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. రెండురోజులు దాటినా కూడా దుర్వాసన తగ్గకపోవడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటిని సోదా చేయగా ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ ఇంటిలో వాసన భరించలేక పోలీసులు చాలా కష్టపడ్డారు. అయితే ఆ మహిళ మాత్రం అక్కడ ఏమీ దుర్వాసన లేనట్లు చాలా సాధారణంగా ఉండటం విశేషం.దీనిపై మరింత చదవండి :