శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (15:39 IST)

వూహాన్‌లో పండగ వాతావరణం.. భారీగా వాటర్ ఫెస్టివల్స్..

చైనాలోని వూహాన్ నగరంలో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ ప్రపంచానికి పరిచయం చేసిన వూహాన్‌లో వాటర్ ఫెస్టివల్స్ భారీగా జరుగుతున్నాయి. సాధారణంగా ప్రతీఏటా ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు అక్కడ వివిధ రకాల సందర్భాలను పురస్కరించుకుని పార్టీలు జరుగుతుండడం ఆనవాయితీగా వస్తోంది.
 
రంగు రంగు నియాన్లైట్స్, డిస్కో లైట్ల మధ్య తాగుతూ వుండడం విశేషం. ఇదే క్రమంలో రకరకాల మాంసాహారాలను భుజిస్తున్నారు. ఈ పార్టీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్నాయి.
 
అయితే... వుహాన్ వాసుల పార్టీలను చూస్తున్న నెటిజెన్‌లు మాత్రం చైనాను దుమ్మెత్తిపోస్తున్నారు. కొంతమంది మాత్రం చైనా తప్పేముందంటూ సమర్థిస్తున్నారు. మరికొంత మంది మాత్రం... చైనా తగిన జాగ్రత్తలను పాటించి ఉంటే ప్రపంచానికి ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదంటూ ఫైర్ అవుతున్నారు.