కారును ఢీకొన్న సైకిల్.. కారుకే డామేజ్.. ఎలా..? (video)

Last Updated: శనివారం, 5 జనవరి 2019 (17:26 IST)
రెండు చక్రాలున్న సైకిల్ ఢీకొని కారు డామేజ్ అయ్యిందంటే నమ్ముతారా? ఇక లాభం లేదు.. నమ్మితీరాల్సిందే. ఇలాంటి ఘటన చైనాలో చోటుచేసుకుంది. అవును సైకిల్ ఢీకొనడంతో కారుకు ముందు భాగం బంపర్ డామేజ్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అయితే ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని కొందరు అనుకోవచ్చు. కానీ నిజానికి సైకిల్ ఢీకొనడంతో కారుకు డామేజ్ అయ్యిందనడం ఖాయం. ఈ ప్రమాదంలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తికి స్వల్ప గాయాలు తగిలాయి. ఇక కారును డ్రైవింగ్ చేసిన వ్యక్తికి ఎలాంటి గాయాలు లేవు. మరి సైకిల్ ఢీకొని కారు డామేజ్ ఎలా అయ్యిందో ఈ వీడియోలో మీరూ చూడండి.దీనిపై మరింత చదవండి :