గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:15 IST)

చరిత్ర సృష్టించిన 'ఖడ్గమృగం'

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ఓ జంతు ప్రదర్శనలో ఓ ఖడ్గంమృగం చరిత్ర సృష్టించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ఖడ్గమృగం పేరు అకుటి. ప్రకృతి సిద్ధమైన ప్రత్యుత్పత్తికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించినట్టు జూ అధికారులు తెలిపారు. 
 
గతేడాది జనవరి 8వ తేదీన ఓ మగ ఖడ్గమృగం 'సురు' నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చెందించినట్టు తెలిపారు. అది విజయవంతమైందని, 15 నెలల గర్భం తర్వాత అది పిల్లకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 23వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో అది ప్రసవించినట్టు తెలిపారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఓ ఖడ్గమృగం బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలోనే ఇదే తొలిసారన్నారు. ఖడ్గమృగం పిల్ల ఆరోగ్యంగా ఉందని వివరించారు.