శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By శ్రీ
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (19:24 IST)

‘మళ్ళీ మళ్ళీ చూశా’ ఆడియన్స్‌కి ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది: హీరో అనురాగ్‌ కొణిదెన

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌కి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్బంగా హీరో అనురాగ్‌ కొణిదెన ఇంటర్వ్యూ.
 
మీ గురించి?
నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌. స్కూలింగ్‌ కాలేజ్‌ అంతా ఇక్కడే కంప్లీట్‌ అయింది. తరువాత రామానాయుడు ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశాను. మా నాన్న గారు కోటేశ్వరరావు ‘క్రిషి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రై.లి మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఈ సినిమా నిర్మాత. 
 
ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మీనాన్న గారికి హెల్పింగ్‌గా ఉండే మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలావచ్చారు?
నాకు కన్‌స్ట్రక్షన్‌ రంగం, సినిమా రంగం రెండు ఇష్టమే.. అయితే నా చదువు అయిపోయాక మా నాన్న గారి వ్యాపారం చూసుకునే వాడిని. కానీ యాక్టింగ్‌ మీద నాకున్న ప్యాషనే నన్ను ఈ రంగం వైపు వచ్చేలా చేసింది.
 
మీ క్యారెక్టర్‌ గురించి?
ఈ సినిమాలో నా క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ ఉంటాయి. కాలేజ్‌ కుర్రాడిలా సెట్టిల్డ్‌ క్యారెక్టర్‌ ఒకటి. మరొకటి కెరీర్‌ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తిరిగే మాస్‌ క్యారెక్టర్‌. కెరీర్ మీద ఆలోచన లేని అతను మళ్లీ కాలేజ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అనేది సినిమాలో మెయిన్‌ పాయింట్‌. నా వరకూ నటుడిగా నవరసాలు చేయడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది.
 
మళ్ళీ మళ్ళీ చూశా స్టోరీ లైన్‌ ఏంటి?
ఈ సినిమా వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరుగుతుంది. జులాయిగా తిరిగే ఒక అబ్బాయికి అనుకోకుండా ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదివినప్పటి నుండి అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. డైరీ చదివితేనే నాలో మార్పులు వస్తున్నాయంటే ఆ డైరీ రాసిన అమ్మాయిని కలిస్తే లైఫ్‌ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది? అని ఆ అమ్మాయి కోసం వైజాగ్‌ నుండి హైదరాబాద్‌ వస్తాడు. ఆ క్రమంలోనే హీరోయిన్‌ని ఎలా కలిశాడు. అసలు కలిశాడా లేదా? అనేది స్టోరీ. ఆడియన్స్‌కి ఈ సబ్జెక్ట్‌ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఒక లవ్‌ స్టోరీ వచ్చి చాలా రోజులు అయింది. అందుకే ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు యాడ్‌ చేసి ఒక ఫుల్‌ మీల్స్‌లా ఈ సినిమాను తెరకెక్కించాం.
సినిమా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనా?
ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ మాది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాదు. అలాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. చిన్నపిల్లలు కూడా ఎలాంటి సందేహం లేకుండా పూర్తి సినిమా చూడొచ్చు.
 
దర్శకుడు హేమంత్‌ కార్తీక్‌ గురించి?
సినిమా ఇండస్ట్రీకి వద్దాం అని కథ వినే సమయంలో మా దర్శకుడు హేమంత్‌ కార్తీక్‌ పరిచయమయ్యాడు. ఆయనకు రైటర్‌గా మూవీస్‌ చేసిన అనుభవం ఉంది. అయితే ఈ కథ నచ్చి దర్శకత్వం చేయడానికి ముందుకు వచ్చారు.
 
ఈ సినిమా మీ కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?
మా పరంగా 100 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టాం. సినిమా ఫలితం ఏంటనేది ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు. అయితే నా కెరీర్‌కి కూడా ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఉంది.
 
హీరోగా మీకు ఇన్స్‌పిరేషన్‌ ఎవరు?
నేను చిన్నపటినుండి వెంకటేష్‌ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్‌.
 
నటన, ప్రొడక్షన్‌ రెండూ ఇబ్బంది అనిపించలేదా?
ఈ సినిమా ప్రొడక్షన్‌ నేను మా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి ఇద్దరం చూసుకునేవాళ్ళం. సతీష్‌ అన్నని రెండు సంవత్సరాల క్రితం ఒక సినిమా ఫంక్షన్‌లో కలవడం జరిగింది. ఆరోజు నుండి మేమిద్దరం కలిసి ట్రావెల్‌ అవుతున్నాం. ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పగానే సరే అని అందరు ఆర్టిస్టులని ఆయనే మాట్లాడి ఒక ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా మా సినిమాకు చాలా హెల్ప్‌ చేశారు.
 
నెక్స్ట్‌ మూవీ?
కొన్ని కథలు విన్నాను. ఒక థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.