శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 27 మే 2016 (19:52 IST)

పవన్ భుజం తట్టి... టెన్షన్ ఎందుకు చేసేయ్ అన్నారు...: నితిన్‌ ఇంటర్వ్యూ

నితిన్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'అ.. ఆ'. (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) అన్నది ఉప శీర్షిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్

నితిన్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'అ.. ఆ'. (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) అన్నది ఉప శీర్షిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో జరిపిన ఇంటర్వ్యూ.
 
ఇప్పుడు 'అ..ఆ'లు నేర్చుకుంటున్నారా?
గట్టిగా నవ్వుతూ... 'అ ఆ' టైటిల్‌ పెట్టినప్పుడే.. ఫ్రెండ్స్‌ ఇదే జోక్‌ వేశారు. దర్శకుడు త్రివిక్రమ్‌ పేరు చెప్పగానే.. ఇదేదో ఇంటలెక్చువల్‌ మూవీ అన్నారు. సో.. చక్కటి లవ్‌ స్టొరీ. ప్రేమకథకు ఫ్యామిలీను లింక్‌ చేసే విధానం బావుంటుంది. లవ్‌ స్టొరీ మాత్రమే కాకుండా హ్యూమన్‌ వాల్యూస్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఈ సినిమాలో ఉంటాయి.
 
మీ పాత్ర ఏం చేస్తుంటుంది?
నేనొక చెఫ్‌ పాత్రలో కనిపిస్తాను. బాధ్యత గల కొడుకుగా, చెల్లెల్ని ప్రేమించే అన్నయ్యగా కొత్తగా కనిపిస్తాను. తనకొక సమస్య ఉంటుంది. అయినా.. కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
 
విడుదల అవుతుందంటే టెన్షన్‌ వుందా?
టెన్షన్‌ అనేది మామూలే.. ప్రతి సినిమాకు ఇదో పరీక్ష. ఎప్పుడు జూన్‌ 2 వస్తుందా? అని ఎదురుచూస్తున్నాను.
 
ఈ చిత్ర కథ ఎలా వర్కవుట్‌ అయింది?
'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమా తరువాత 'హార్ట్‌ ఎటాక్‌' సినిమా షూటింగ్‌ కోసం నేను స్పెయిన్‌ వెళ్లాను. ఆ సమయంలో ఈ సినిమాలో నటించమని ఫోన్‌ చేసి అడిగారు. చాలా సంతోషపడ్డాను. అంతా.. ఓకే అయిపోతుందనుకున్న సమయంలో సడెన్‌గా ఆగిపోయింది. కొంచెం బాధపడ్డాను. కానీ సంవత్సరం తరువాత మళ్ళీ కాల్‌ చేసి అడిగారు. కరెక్ట్‌ టైం లో మంచి సినిమా పడింది.
 
త్రివిక్రమ్‌ నుంచి ఏం నేర్చుకున్నారు?
త్రివిక్రమ్‌ గారితో కలిసి వర్క్‌ చేయాలనేది నా కల. ఆయన దగ్గర నుండి ఫోన్‌ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం ఆయనైతే మరొక కారణం కథ. నేను నటించిన 22 సినిమాలకు ఈ సినిమాకు ఖచ్చితంగా చేంజ్‌ ఉంటుంది. ప్రతి రోజు కథ గురించి డిస్కస్‌ చేసేవాళ్ళం. ఇది దర్శకుడి సినిమా అని చెప్పొచ్చు. సినిమా మొదలయినప్పటినుండి కొత్తగా ఉండాలని త్రివిక్రమ్‌ గారు పరితపించేవారు. ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం ఆయనకే చెందుతుంది. ఆయనొక జ్ఞాని. ఆయనకు తెలియని విషయమంటూ ఉండదు. నాకు ఎలాంటి సమస్య వచ్చినా.. మొదట ఆయనకే ఫోన్‌ చేస్తాను.
 
గత ఫెయిల్యూర్స్‌ను తలచుకుంటే ఏమనిపిస్తుంది?
2002లో నా కెరీర్‌ మొదలుపెట్టాను. 14 సంవత్సరాల్లో 22 సినిమాలు తీశాను. కాని గత నాలుగు సంవత్సరాల నుండే నాకు హిట్స్‌ వచ్చాయి. 2011 వరకు సుమారుగా అన్నీ ఫ్లాప్సే. ఆ సమయంలో నేను చాలా నేర్చుకున్నాను. మాస్‌ సినిమాలు నాకు సెట్‌ కావట్లేదని, నా బాడీ లాంగ్వేజ్‌‌కు తగ్గట్లుగా లవ్‌ స్టోరీస్‌ సెలక్ట్‌ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే 'ఇష్క్‌','గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కాని ఏరోజు నేను క్రుంగిపోలేదు. పర్సనల్‌‌గా నేను చాలా స్ట్రాంగ్‌‌గా ఉంటాను. ఫ్లాప్స్‌ వస్తున్నాయని నా డాన్స్‌ ప్రాక్టీస్‌ కాని మరొకటి కాని ఏది మానలేదు. నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకుంటూనే ఉన్నాను.
 
పవన్‌ కళ్యాణ్‌ ఇందులో నటిస్తున్నారా?
ఈ సినిమా సెట్స్‌‌కు పవన్‌ కళ్యాణ్‌గారు వచ్చారు. నిజానికి ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు. అప్పుడే సాంగ్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఆయన ముందు నటించడానికి చాలా టెన్షన్‌ పడ్డాను. పర్లేదు చేయి.. అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు.
 
నిర్మాతగా 'అఖిల్‌' ఏం నేర్పింది?
'అఖిల్‌' సినిమా పరాజయం నన్ను చాలా బాధ పెట్టింది. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి వర్క్‌ చేశారు కానీ మేము అనుకున్న రిజల్ట్‌ మాత్రం రాలేదు. దాంతో ఓ నాలుగైదు రోజులు నాకు నిద్ర కూడా పట్టలేదు.
 
'గుండెజారి..' సీక్వెల్‌ అన్నారు. ఎంతవరకు వచ్చింది?
మా ప్రొడక్షన్‌లో సినిమాలు నిర్మిస్తూనే ఉంటాం. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాకు సీక్వెల్‌ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్‌ హాఫ్‌ స్టొరీ కూడా రెడీ అయింది. సెకండ్‌ హాఫ్‌ కూడా బాగా వస్తేనే చేస్తాను. లేదంటే చేయను.
 
రాజమౌళి, త్రివిక్రమ్‌ కంపేర్‌ చేస్తే..?
నేను చాలామంది దర్శకులతో పని చేశాను. ఎవరి స్టైల్‌ వారికి ఉంటుంది. త్రివిక్రమ్‌ గారు నన్ను చదివేశారు. నా బాడీ లాంగ్వేజ్‌, మాట తీరు, హెయిర్‌ స్టైల్‌ ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకునేవారు. రాజమౌళి తరువాత నా మీద అంత కేర్‌ తీసుకొని సినిమా చేసింది త్రివిక్రమ్‌ గారే.
 
పెండ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
ఇంట్లో రెండు సంవత్సరాలుగా అడుగుతున్నారు. నేనేమో నెక్స్ట్‌ ఇయర్‌ చేసుకుంటా.. అని దాటేస్తూ వస్తున్నాను. వీలైనంత వరకు పెళ్లి వాయిదా వేస్తూనే ఉంటా.
 
సమంత పాత్రే ఎక్కువగా వుందని వార్తలు వస్తున్నాయి?
ఎనిమిది పాత్రల చుట్టూ కథ జరుగుతుంది. అనసూయ, ఆనంద్‌.. అందులో రెండు పాత్రలే. ప్రేమకథల్లో హీరోహీరోయిన్లే వుంటారు. అందులో ఒకరు ఎక్కువ తక్కువ చూడలేం.
 
తదుపరి చిత్రాలు?
ఇంకా ఏమీ ఫైనల్‌ కాలేదు. ఈ చిత్రం రిజల్ట్ తర్వాతే ఆలోచిస్తా అని చెప్పారు.