శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 23 జూన్ 2015 (19:40 IST)

మహేష్‌ బాబు నన్ను ప్రిఫర్‌ చేశారు: రాహుల్‌

'అందాల రాక్షసి' చిత్రంతో వెండితెరకు పరియమైన హీరో రాహుల్‌ రవీంద్రన్‌.. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. ఈ ఏడాది చేసినా 'అలా ఎలా' చిత్రం ఎంతో గుర్తింపు తెచ్చింది. తాజాగా సందీప్‌ కిషన్‌తో 'టైగర్‌' సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్‌... 
 
'టైగర్‌' అంటే ఏమిటి? మీ పాత్ర ఎలా వుంటుంది?
టైగర్‌లా అనుకున్నది చేసేరకం. తను నేను ప్రాణ స్నేహితులం. ఇద్దరు తెలీకుండా ఓ అమ్మాయిని ప్రేమిస్తాం. ఆ తర్వాత ముగ్గురి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ సినిమాలో నేను విష్ణు అనే పాత్రలో నటించాను. తన స్నేహితుడి కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. అది ఈ సినిమాలో ఎలా వుంటుందో అనేది చూడాల్సిందే.
 
సోలో హీరో కాకుండా షేర్‌ చేసుకోవడానికి కారణం?
ఇప్పుడిప్పుడే నా కెరీర్‌లో డెవలప్‌మెంట్‌ కన్పిస్తుంది. 'అలాఎలా' సినిమా విజయంతో నాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. దానికి మంచి శాటిలైట్‌ వాల్యూస్‌ వచ్చాయి. ఆ చిత్రం తరువాత చాలా ఆఫర్స్‌ వచ్చాయి. కాని జాగ్రత్తగా స్క్రిప్ట్స్‌‌ను సెలెక్ట్‌ చేసుకుంటున్నాను. ఈ సినిమాలో నా పాత్రకు హీరో పొజిషన్‌లో ఉన్న నటుడు చేస్తేనే బావుంటుంది. సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ అయినా, లీడ్‌ రోల్‌ అయినా మంచి కథ అయితే చేస్తాను.
 
సందీప్‌తో మీ జర్నీ ఎలా జరిగింది?
మూడు సంవత్సరాలుగా సందీప్‌తో నాకు పరిచయం ఉంది. మంచి స్నేహితుడు. ఆనంద్‌ దగ్గర మంచి కథ ఉంది. ఒకసారి విను... నచ్చితే కలిసి చేద్దామని చెప్పారు. కథ వినగానే నాకు నచ్చింది. ఓకే చెప్పాను. ఓ ఫ్రెండ్‌‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సెట్స్‌‌పై చాలా ఎంజాయ్‌ చేసాం. 
 
తమిళ దర్శకుడికే అవకాశం ఇచ్చారా?
తెలుగు, తమిళ అనేది కాదు. నన్ను ముందుగా అప్రోచ్‌ అయింది ఆనంద్‌. ఆయన చేసిన 'అప్పుచి గ్రామం' తమిళ సినిమాను చూశాను. ఆయన వర్క్‌ చాలా నచ్చింది. ట్రీట్మెంట్‌ పరంగా ఈ సినిమా ఫాస్ట్‌ బేస్డ్‌ మూవీ. ఎంటర్‌టైన్మెంట్‌ వాల్యూస్‌ తగ్గకుండా చేసారు. 
 
షూటింగ్‌లో అనుభవాలు ఏమైనా ఉన్నాయా..?
ఎందరో సీనియర్‌ హీరోల సినిమాలకు పనిచేసిన చోటా కె నాయుడుతో చేయడం ఆనందంగా వుంది. అలాంటిది ఆయనొచ్చి బాగా చేసావని అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యాను. 
 
తమిళంలో చేస్తున్నట్లు తెలిసింది?
తమిళంలో 'సెగ' సినిమా డైరెక్టర్‌తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తారంటేనే నటిస్తానని చెప్పాను. నా ప్రయారిటీ ముందు తెలుగుకే.
 
శ్రీమంతుడు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
శ్రీమంతుడులో ఓ అతిథి పాత్రలో నటించాను. మహేష్‌గారే ఈ పాత్రకు నేనైతేనే సూట్‌ అవుతానని డైరెక్టర్‌ కొరటాల శివకు చెప్పారట. మహేష్‌ గారంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆయన నాపేరు చెప్పడం చాలాచాలా సంతోషంగా అనిపించింది. సినిమాలో నా పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది.
 
సినిమాల జర్నీ ఎలా ఉంది..?
లవ్లీ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సినిమాలలో నటించానని చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు సినిమాలంటే ఇష్టం. ఈ ప్రొఫెషన్‌ తప్ప మరొకటి తెలియదు. గ్రోత్‌ లేకపోయినా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. 
 
కొత్త చిత్రాలు?
ఇటీవలే 'హైదరాబాద్‌ లవ్‌ స్టొరీ' సినిమా పూర్తయింది. ఆగస్టులో సినిమాను రిలీజ్‌ చేసే ప్లాన్‌‌లో ఉన్నాం. తమిళంలో ఒక సినిమా. అవి కాకుండా సోలో హీరోగా రెండు ప్రాజెక్ట్స్‌ ఫైనల్‌ చేశాను. ఆ రెండు ఆగస్టులో స్టార్ట్‌ అవుతాయి అని ముగించారు.