Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు కరాటే వచ్చు... నాజోలికొస్తే చితక్కొట్టేస్తా... మనోజ్ ఓ బెస్ట్ ఫ్రెండ్ : ప్రగ్యా జైస్వాల్

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:07 IST)

Widgets Magazine
pragya jaiswal

తాను ఆరు నెలలుగా సినిమా షూటింగ్‌ కోసం ఇక్కడే ఉన్నాననీ... ఇక్కడంతా మంచివాల్ళేనని.. షూటింగ్‌లో చూపించే ఆప్యాయతలు ఇంటిలో ఉన్నట్లే ఉందని... నటి ప్రగ్యా జైస్వాల్‌ చెబుతోంది. 'కంచె' సినిమాతో హీరోయిన్‌‌గా ఫిలిం ఫేర్‌, సైమా అవార్డులను గెలుచుకున్న హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ ప్రస్తుతం మంచు మనోజ్‌ 'గుంటూరోడు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 3న రిలీజవుతున్న సందర్బంగా ఆమె చెప్పి విశేషాలు.
 
* 'లవ్‌‌లో పడ్డాడు' ఈ ట్యాగ్‌ లైన్‌కి అర్థమేమిటి?
దాని గురించి తెలీదు. కానీ ఇందులో మనోజ్‌ చాలా మాస్‌ లుక్‌తో కనిపిస్తాడు. కాబట్టి ఫైట్స్‌, స్టంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటే ఒక బలమైన లవ్‌ ట్రాక్‌ కూడా నడుస్తుంటుంది. అంత మాస్‌ అబ్బాయి లవ్‌ స్టోరీ ఏంటనేది సినిమాలోని ముఖ్యమైన పాయింట్స్‌లో ఒకటి.
 
* ఫైట్స్‌ ఎవరికోసం చేస్తాడు?
ఇంకెవరి కోసం.. నా కోసమే.. ఏ సినిమాలో అయినా హీరోయిన్‌ కోసమే కదా.. అది ఎందుకనేది ఈ సినిమాలో చూడాల్సిందే.
 
* పాత్ర ఎలా ఉంటుంది?
పక్కా గుంటూరు అమ్మాయిలా చాలా సాధారణంగా కనిపిస్తాను. చాలా స్వీట్‌‌గా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాకి సైన్‌ చేశాను. ఇది నా రియల్‌ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది.
 
* మనోజ్‌తో నటించడం ఎలా ఉంది?
మంచి స్నేహితుడిలా ఉంటాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎప్పుడూ జోక్స్‌ వేస్తూ నవ్విస్తుంటాడు. జోక్స్‌ వేస్తూనే కెమెరా ముందుకెళితే టక టకా డైలాగ్స్‌ చెప్పేస్తుంటాడు. ఫైట్స్‌, డ్యాన్సుల్లో కొంచెం ఎమోషనల్‌‌గా ఉంటాడు.
 
* మూడు భిన్నమైన పాత్రలు చేశారు. ఎలా అనిపించింది?
'కంచె' సినిమా జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'ఓం నమో వేంకటేశాయ' సినిమా కూడా మంచి పేరు తెచ్చింది. ఈ రెండింటికంటే గుంటూరోడు పక్కా మాస్‌ కథ కనుక. కమర్షియల్‌గా నాకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను.
 
* ముగ్గురు డైరెక్టర్ల పనితీరు గమనించారా?
'కంచె' చేసేటప్పుడు దర్శకుడు క్రిష్‌.. భోజనం చేస్తున్నా.. షాట్‌ గురించే ఆలోచించేవారు. ఖాళీగా కూర్చొనేవారు కాదు. అవసరమైతే రిహార్సల్‌ కూడా చేయించేవారు. ఇక రెండో సినిమా రాఘవేంద్రరావుగారు ఓ సీనియర్‌. ఆయన ఒక్కసారి అనుకున్న షాట్‌ వెంటనే వచ్చేలా ప్లాన్‌ చేసేవారు. అందులో చిన్న పాత్రే అయినా చక్కగా చేశావ్‌! అని మెచ్చుకున్నారు. ఇక గుంటూరోడులో దర్శకుడు సత్య మంచి రైటర్‌ కూడా. చెప్పే ప్రతి పాయింట్స్‌, తీసే ప్రతి సీన్‌ సినిమాకి ఎక్కడో ఒక దగ్గర కనెక్టయ్యే ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి పాయింట్‌ చాలా సాధారణంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకున్నారు. మంచి యాక్టర్‌.
 
* హైదరాబాద్‌తో మీ రిలేషన్‌ ఎలా ఉంది?
ఈ సినిమా కోసం వరుస ఆరు నెలలు ఇక్కడే ఉన్నాను. ఇక్కడి జనాలు చాలా మంచివారు. నిజాయితీగా ఉంటారు. అందుకే నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది.
 
* కృష్ణవంశీ 'నక్షత్రం' ఎంతవరకు వచ్చింది?
 ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. 
 
* ఫైట్స్‌ నేర్చుకున్నారా?
చిన్నతనంలోనే మా అమ్మ... కరాటే నేర్పించింది. నేను ఫైట్స్‌ బాగా చేయగలను. నన్ను అలా చేయాలని ప్రయత్నిస్తే చితక్కొట్టేస్తా. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దుమ్మురేపుతున్న 'ఘాజీ' వసూళ్లు... ఊపిరి పీల్చుకుంటున్న నిర్మాత

దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'ఘాజీ' మంచి వసూళ్లను రాబడుతోంది. భారతీయ సినీ ...

news

మరీ ఇంత ఛండాలంగానా? ఆస్కార్స్ వేడుకలో రహస్య అంగాన్ని ప్రదర్శిస్తూ...

ఆస్కార్ అనగానే అదేదో బట్టలిప్పేసే ప్రదర్శనలా మారిపోయిందా అనే డౌటు వస్తోంది. రెడ్ కార్పెట్ ...

news

'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త'కు గుమ్మడికాయ కొట్టేశారు... విడుదలకు ముస్తాబు

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ...

news

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా 'ఇద్దరి మధ్య 18'.. ఆడియో విడుదల

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా ...

Widgets Magazine