శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 21 జూన్ 2016 (21:00 IST)

38 ఏళ్ళలో రాని క్రెడిట్‌ అది.. నన్నంతా కట్టప్పా అంటున్నారు... సత్యరాజ్‌ ఇంటర్వ్యూ

నటుడిగా 220 సినిమాలు. 38 సంవత్సరాల అనుభవం, 75 చిత్రాల్లో విలన్‌గా, 125 చిత్రాలకు పైగా హీరోగా యాక్ట్‌ చేశాను. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాను. కానీ ఒకే ఒక్క సినిమాను నా కెరీర్‌ను మార్చేసింది. అదే కట్టప్ప పాత్ర. బాహుబలి అంతర్జాతీయ స్థాయ

నటుడిగా 220 సినిమాలు. 38 సంవత్సరాల అనుభవం, 75 చిత్రాల్లో విలన్‌గా, 125 చిత్రాలకు పైగా హీరోగా యాక్ట్‌ చేశాను. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాను. కానీ ఒకే ఒక్క సినిమాను నా కెరీర్‌ను మార్చేసింది. అదే కట్టప్ప పాత్ర. బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఇంతకంటే అదృష్టం లేదు అంటూ.. సత్యరాజ్‌ తెలియజేశారు. ఆయన నటించిన తమిళ సినిమాను తెలుగులో 'దొర'గా విడుదల చేస్తున్నారు. ధరణీధరన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ హీరోగా నటించారు. బిందుమాధవి నాయిక. కరుణాకరన్‌, సహాయం రాజేంద్రన్‌ ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాను జూలై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ....
 
దొర టైటిల్‌ అంటే ఏమిటి?
కామెడి, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కలగలిసిన హర్రర్‌ చిత్రం. ఇందులో నా పాత్ర పేరు దొర. నేను ఈ చిత్రం ఆత్మ పాత్రలో నటించాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే జాక్సన్‌ అనే బ్రిటీష్‌ దెయ్యానికి, దొర అనే ఇండియన్‌ దెయ్యానికి జరిగే కథే ఇది. తమిళంలో ఈ చిత్రానికి 'జాక్సన్‌ దొరై' అనే టైటిల్‌ పెడితే తెలుగులో 'దొర' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.
 
ఇలాంటి పాత్ర చేయడానికి కారణం?
ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా అన్నిచోట్ల దెయ్యాల చిత్రాల ట్రెండ్‌ నడుస్తుంది. అదొక కారణమైతే దర్శకుడు ధరణీధరన్‌ సినిమాను మంచి కథనంతో తెరకెక్కించాడు. అతను చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇక నా క్యారెక్టర్‌ పరంగా చూస్తే దెయ్యం పాత్ర కాబట్టి దెయ్యం పాత్ర ఇలాగే ఉండాలనేం లేదు కాబట్టి నా స్టయిల్లో దర్శకుడిని ఫాలో అయిపోయాను.
 
కుమారుడితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
ఇది రెండోసారి. తెలుగులో సక్సెస్‌ సాధించిన 'స్టూడెంట్‌ నెం.1' చిత్ర రీమేకే తన తొలి సినిమా. దొర సినిమాలో కూడా మేం ఇద్దరం కలిసి యాక్ట్‌ చేశాం. నా కొడుకు విషయానికి వస్తే తను పదేళ్లుగా నటిస్తూనే ఉన్నాడు.
 
ఇటీవల స్పీడ్‌ పెంచారే?
ఇంతకుముందు కంటే స్పీడ్‌ పెరిగింది. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటితరం దర్శకులు నా నటనను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్‌ను డిజైన్‌ చేసుకుంటున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల, రాజమౌళి, కొరటాల శివ ఇలా అందరూ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ రాయడం వల్ల నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం కలిగింది. అలాకాకుండా మన స్టయిల్లో నటించమని చెప్పి యాక్ట్‌ చేస్తే అన్నీ పాత్రలు ఒకేలా అనిపిస్తాయి. ఇలా డిఫరెంట్‌ పాత్రలు చేయడం నటుడిగా చాలా సంతోషాన్నిస్తుంది. నటుడిగా నేను ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు కానీ నా సినిమాలు తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. చిరంజీవి పసివాడి ప్రాణం, ఎస్‌.పి.పరుశురాం, మోహన్‌ బాబు అసెంబ్లీ రౌడీ, ఎం.ధర్మరాజు ఎం.ఎ ఇలా చాలా సినిమాలు తెలుగులోకి రీమేక్‌ అయ్యాయి.
 
బాలీవుడ్‌లో ఆదరణ ఎలావుంది?
బాలీవుడ్‌లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమా చేశాను. అయితే నాకు హిందీ లాంగ్వేజ్‌ రాదు. అలాగని ఇప్పుడు నా వయసు 61 సంవత్సరాలు, ఈ సమయంలో కొత్త లాంగ్వేజ్‌ నేర్చుకోవడం అంటే ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ప్రామ్‌టింగ్‌పై ఆధారపడుతున్నాను. ప్రామ్‌టింగ్‌ సరిగ్గా ఉంటే ఏ భాషలోనైనా యాక్ట్‌ చేసేయవచ్చు. అది సరిగా లేకుంటేనే సమస్య వస్తుంది.
 
'బాహుబలి' ఎలాంటి పేరు తెచ్చింది?
నటుడిగా 38 సంవత్సరాలు, 220 చిత్రాల్లో యాక్ట్‌ చేశాను. అందులో 75 చిత్రాల్లో విలన్‌గా నటిస్తే, 125 చిత్రాలకు పైగా హీరోగా యాక్ట్‌ చేశాను. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాను. చాలా డిఫరెంట్‌ పాత్రలు చేస్తున్నాను. అయితే బాహుబలిలో నేను చేసిన కట్టప్ప పాత్రకు చాలామంచి పేరు వచ్చింది. నటుడి కెరీర్‌లో ఒకసారి మాత్రమే చేయగల పాత్ర అది. బయటకు వెళ్ళినప్పుడు నా పేరుతో కాకుండా కట్టప్ప అని సంబోధించడం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అంటూ కామెంట్స్‌, కార్టూన్స్‌ రావడం ఇవన్నీ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను.
 
కొత్త చిత్రాలు?
దొర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బాహుబలి-2 సినిమా షూటింగ్‌ జరుగుతుంది. రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాలో రామ్‌ తండ్రి పాత్రలో కనపడతాను. అలాగే తెలుగు నుండి తమిళంలో రీమేక్‌ అవుతున్న పటాస్‌ చిత్రంలో సాయికుమార్‌ పాత్రలో నటిస్తున్నాను అని ముగించారు.