శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2016 (20:54 IST)

తమన్నాలా ఎవరూ చేయలేరు, అందుకే మళ్లీ తమన్నానే... బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూ

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 2014లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత సుమారుగా రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకున్న ఈ నటుడు కొత్త సంవత్సరంలో(2016) 'స్పీడున్నోడు' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చిట్‌ చాట్‌.
 
స్పీడున్నోడు.. టైటిల్‌ పెట్టడానికి కారణం?
నేను డాన్స్‌ బాగా చేస్తానంటారు. చాలా స్పీడ్‌గా చేస్తాను. మాట్లాడే తీరుతోపాటు నేను నడిచే నడక కూడా స్పీడుగా వుంటుంది. లొకేషన్‌ లోకి చాలా స్పీడుగా వస్తాను. ఇలా అన్ని చూశాక.. టైటిల్‌ స్పీడున్నోడు పెడతానని దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ చెప్పారు. అంతకుముందు నాలుగు టైటిల్స్‌ అనుకున్నా.. నన్ను ప్రత్యక్షంగా చూశాక.. టైటిల్‌ మార్చారు. కథ కూడా అలాగే వుంటుంది.
 
'సుందర పాండ్యన్‌' చూశాక ఏమనిపించింది?
తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'సుందర పాండ్యన్‌' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళంలో ఈ సినిమాను చూసినప్పుడు బాగా కనెక్ట్‌ అయ్యాను. ఫ్రెండ్స్‌‌కు సంబంధించిన కథ. నాకు రియల్‌ లైఫ్‌‌లో కూడా చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఫ్రెండ్స్‌ లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది. క్లైమాక్స్‌ అధ్బుతంగా ఉంటుంది. సినిమా చూసిన తరువాత ఒక్క నిమిషమయినా ఆలోచిస్తారు.
 
మీకే సూటు అవుతుందనుకున్నారా?
ఈ కథ ఎవరికైనా సూట్‌ అవుతుంది. ఇప్పుడున్న ఏ హీరో అయినా కథకు సెట్‌ అవుతాడు. తమిళంలో శివకుమార్‌.. కన్నడలో కొత్త హీరో చేశారు. తెలుగులో ఇప్పుడిప్పుడే వస్తున్న నాకు బాగా సూటవుతుందని అనిపించింది.
 
దర్శకుడికి దగ్గరకు మీరే వెళ్ళారా?
లేదు. ఆయనే నా దగ్గరకు వచ్చారు. నా గత చిత్రం చూసి కరెక్ట్‌గా సరిపోతుందని అన్నారు.
 
మరి రవితేజ, సునీల్‌ను కూడా అనుకున్నారని దర్శకుడు చెప్పారే?
కరెక్టే.. ముందుగా అనుకున్నారు. కానీ వారి డేట్స్‌ వల్ల కుదరలేదు. 
 
తమన్నానే హీరోయిన్‌ అనుకుని ఐటంసాంగ్‌గా మార్చారా?
మొదట ఈ సినిమా కోసం హీరోయిన్‌‌గా తమన్నానే అనుకున్నాం. కాని కథకు ఫ్రెష్‌ ఫేస్‌ అయితే బావుంటుందని సొనారికను సెలెక్ట్‌ చేసుకున్నాం. తమన్నాతో స్పెషల్‌ సాంగ్‌ చేయించాలనుకున్నాం. తను బెస్ట్‌ డాన్సర్‌. నాకు మంచి ఫ్రెండ్‌ కూడా.
 
వరుసగా తమన్నాతో నటిస్తున్నారని?
అల్లుడు శ్రీనులో చేశాను. ఈ సినిమాలో చేశాను. రాబోయే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆమెనే హీరోయిన్‌. నా దృష్టిలో డాన్స్‌ బాగా వేసే నటిలో తమన్నా ఒకరు. ఇంకెవరూ అంతలా డాన్స్‌ చేయరేమో అనిపిస్తుంది.
 
మొదటి సినిమాకు కష్టపడ్డారు. 2వ సినిమా తగ్గించారా?
నా మొదటి సినిమా 'అల్లుడు శీను' కంటే ఈ సినిమా కోసం 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్‌ స్టైల్‌, మేకప్‌, డ్రెస్సింగ్‌, నా హావభావాలు ఇలా ప్రతి విషయంలో కొత్తగా కనిపిస్తాను.
 
ఫాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ కారణం?
కథ ప్రకారమే కర్నూలు బ్యాక్‌డ్రాప్‌ వెళ్ళాం. ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌ నాది. కర్నూలుకు చెందిన కుర్రాడిలా కనిపిస్తాను. విలేజ్‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే కథ. ఫ్రెండ్స్‌ కోసం ఏదైనా చేసే పాత్ర. అమ్మాయిల విషయంలో ఎక్స్‌‌పర్ట్‌ అయిన తనను ఫ్రెండ్స్‌ అందరూ సలహాలు అడుగుతూ ఉంటారు.
 
రియల్‌ లైఫ్‌లో అమ్మాయిల విషయంలో అంతేనా?
లేదు. బయట అమ్మాయిలంటే బెరుకుగా వుంటుంది. నా మొదటి సినిమాకు చాలా బెరుకుతో పనిచేశాను. దానికోసం కొంత కష్టపడాల్సి వచ్చింది.
 
అల్లుడు శ్రీనుకు దీనికి గ్యాప్‌ వుంది?
దాదాపు ఏడాదిన్నర వరకు గ్యాప్‌ వుంది. ఈ గ్యాప్‌లో దాదాపు 40 కథలు విన్నాను. అన్నీ బాగానే వున్నా.. ఎక్కడో తేడా అనిపించేది. ఆఖరికి తమిళ రీమేక్‌ చూశాక వెంటనే చేయాలనిపించింది.
 
ఫ్రెండ్‌షిప్‌ కథను ఫ్రెండ్స్‌కు చూపించారా?
నిన్ననే నా ఫ్యామిలీకు, స్నేహితులందరికీ కలిపి సినిమా చూపించాను. నాన్నగారు సినిమా చూసిన వెంటనే గట్టిగా కౌగిలించుకున్నారు. అమ్మ అసలు తన ఫీలింగ్స్‌ ఎక్స్‌‌ప్రెస్‌ చేయలేకపోయింది. నా ఫ్రెండ్స్‌ అందరూ క్లైమాక్స్‌ చూసి చాలా ఎమోషనల్‌ అయ్యారు. 
 
తదుపరి చిత్రం?
బోయపాటి శ్రీను గారి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా వుంది. అయితే గతంలో చెప్పిన కథ కాదు. ఇది కొత్త కథ. ఏప్రిల్‌లో సినిమా తెరపైకి వస్తుంది అని చెప్పారు.