శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (22:08 IST)

ప్రపంచమే పురుషాధిక్య సమాజం... రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇంటర్వ్యూ

'వెంకటాద్రి ఎక్స్‌‌ప్రెస్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, ఎన్‌టిఆర్‌ వంటి యువ హీరోల చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆమె... మహేష్‌ బాబు చిత్రంలో మిస్‌ అయినందుకు బాధగా వున్నా... కొన్ని అలా జరుగుతాయని చెబుతోంది. ఇన్నేళ్ళ కెరీర్‌లో తను నేర్చుకున్న విషయాలను చాలా తెలివిగా సమాధానాలు చెబుతోంది. ప్రస్తుతం ఆమె శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన 'బ్రూస్‌ లీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 10న రకుల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె చెప్పిన సంగతులు.
 
బ్రూస్‌ లీ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది?
ఇందులో రియా పేరు గల పాత్ర నాది. వీడియో గేమ్స్‌ డిజైన్‌ చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నాను. స్టంట్‌ మాస్టర్‌ అయిన హీరో మీద గేమ్‌ డిజైన్‌ చేస్తాను. ఆలోచించకుండా మాట్లాడుతూ ఉండే క్యారెక్టర్‌. నా స్టుపిడిటీతో ప్రేక్షకులను నవ్విస్తాను. బ్రూస్‌ లీ ఒక పవర్‌ ప్యాకెడ్‌ యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. 
 
పాటల్లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు?
నేను అలా కనిపిస్తున్నానంటే ఫస్ట్‌ క్రెడిట్‌ నా జిమ్‌‌కే చెందుతుంది. శ్రీనువైట్ల గారి విజువలైజేషన్‌, నా స్టైలిష్‌ సహాయంతో నేను అందంగా కనిపిస్తున్నాను. గ్లామరస్‌గా ఉంటాను కానీ ఎక్కడా వల్గారిటీ ఉండదు. 
 
సినిమాలో సాంగ్స్‌ కోసం ఎంత కష్టపడ్డారు?
15 నుండి 20 రోజులు దానిపై చాలా వర్క్‌ చేసాం. పాటలు హైలెవల్‌లో కనిపించాలాని జాగ్రత్తలు తీసుకున్నాం. రెండు పాటల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసాం. 
 
డాన్స్‌లో చరణ్‌ స్పీడ్‌ను అందుకున్నారా?
మొదట తనతో డాన్స్‌ చేయాలంటే చాలా భయమేసేది. తను రిహార్సల్స్‌ అవసరం లేకుండానే డాన్స్‌ చేసేస్తాడు. నేను రెండు రోజుల ముందు నుండి రిహార్సల్స్‌ చేసేదాన్ని. చరణ్‌ స్టార్‌ హీరో అయినా తనలో ఎలాంటి యారోగన్స్‌ లేదు. మంచి హ్యూమర్‌ ఉన్న పర్సన్‌. తన నుండి చాలా నేర్చుకున్నాను.
 
మీకు మార్షల్‌ ఆర్ట్స్‌‌లో టచ్‌ ఉందా..?
నాకు మార్షల్‌ ఆర్ట్స్‌ గురించి అసలు తెలియదు. చిన్నప్పుడు మాత్రం కరాటే నేర్చుకున్నాను. సెల్ఫ్‌ డిఫెన్సు అయితే చేయగలను. 
 
పురుషాధిక్యత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తున్నారు?
ఇండస్ట్రీయే కాదు.. వరల్డ్‌ మొత్తం మేల్‌ డామినేటెడే కదా...

షూటింగ్‌లో మర్చిపోలేని సంఘటన ఉందా..?
'లే చలో' పాటలో చిరంజీవి గారు నన్ను చూసి మెచ్చుకున్నారు. మొదటిరోజు ఆయన షూటింగ్‌కి వచ్చినప్పుడు నన్ను పిలిచి సాంగ్‌ చూసాను చాలా అందంగా కనిపిస్తున్నావని చెప్పగానే సంతోషంగా అనిపించింది. ఆడియన్స్‌ నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో.. నాకు తెలియదు కానీ చిరంజీవి కాంప్లిమెంట్‌‌తో నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఆయన సినిమాల పట్ల ఎంతో ప్యాషన్‌, డెడికేషన్‌తో ఉంటారు. డైరెక్టర్‌ షాట్‌ ఓకే అని చెప్పినా.. ఆయన ఇంకోసారి చేస్తానని చెప్పేవారు. ఈ సినిమా కోసం చిరంజీవి గారితో కలిసి వర్క్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను.
 
షారూక్ ఖాన్‌ వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
రాత్రి 12 గంటల సమయంలో యూనిట్‌ అంతా సాంగ్‌ షూట్‌ చేసే పనిలో ఉన్నాం. సడెన్‌‌గా అందరూ బయటకి వెళ్ళిపోతున్నారు. నేను చరణ్‌ సెట్‌ మీద ఉన్నాం. ఏం జరుగుతుందో.. మాకు అర్ధం కాలేదు. తరువాత చూస్తే ఎదురుగా షారుక్ ఖాన్‌ ఉన్నారు. బ్రూస్‌లీ యూనిట్‌కి సూపర్‌సర్‌ప్రైజ్‌ ఇచ్చారాయన. షారుక్ సెట్‌లోనే కూర్చొని చెర్రీ స్టెప్పులు చూసి ఎంజాయ్‌ చేసారు. తరువాత మానిటర్‌‌లో చూసి రిహార్సల్స్‌ లేకుండా చాలా బాగా చేసావని చరణ్‌‌ను పొగిడారు. అలానే ఫైట్‌ సీక్వెన్సెస్‌ చేస్తున్నప్పుడు చాలా థ్రిల్‌ ఫీల్‌ అయ్యాను. 
 
సినిమాలో హైలైట్స్‌ ఏంటి..?
చరణ్‌ క్యారెక్టర్‌, శ్రీను వైట్ల గారి కమర్షియల్‌ సెన్స్‌, బ్రదర్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ ఇలా ప్రతి ఎలిమెంట్‌ సినిమాలో హైలైట్‌‌గా నిలుస్తుంది. 
 
హీరోయిన్స్‌లో మీకు కాంపిటిషన్‌ ఎవరనుకుంటున్నారు..?
నాకు నేనే కాంపిటిషన్‌. పీస్‌ ఆఫ్‌ మైండ్‌‌తో సంతోషంగా నేను పని చేసుకోవాలి. కాంపిటిషన్‌ గురించి ఆలోచిస్తూ ఉంటే నటన మీద ఫోకస్‌ చేయలేను. కాంపిటిషన్‌ అనే విషయాన్ని అసలు పట్టించుకోను. హీరోయిన్‌‌గా నా నంబర్‌ ఎంత అనే విషయాల గురించి ఆలోచించను.
 
తెలుగులో మీ ఫేవరెట్‌ హీరో?
పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు ఇలా చాలామంది యాక్టర్స్‌ నాకు నచ్చుతారు.
 
కానీ మహేష్‌తో మిస్‌ అయ్యారే?
అవును.. బ్రహ్మోత్సవం మిస్‌ అయ్యా.. ఆఫర్‌ వచ్చినా సమయం లేక చేయలేకపోయాను.. బాడ్‌లక్‌.. 
 
మీ రియల్‌లైఫ్‌లో ఫేవరేట్‌ ఎవరు?
నా ఫేవరేట్‌ ఎవ్వరూ రాలేదు. వస్తే తప్పక చెబుతా..
 
రెమ్యునరేషన్‌ పెంచారని తెలిసింది?
సినిమా సినిమాకు ఎలాగూ పెరుగుతుంది. అది కూడా నా మేనేజర్‌కే తెలుస్తుంది.
 
తొలి సినిమా నుంచి ఇప్పటివరకు మీరెలాగున్నారో విశ్లేషించుకున్నారా?
మీరే చెప్పండి.. నేను మిమ్మల్ని మొదటినుంచి చూస్తున్నా... మీరు నన్ను చూస్తున్నారు.. ఏవైనా మార్పు వుంటే తెలియజేయండి. 
 
కొత్త చిత్రాలు?
ఎన్‌టిఆర్‌తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌ సరైనోడు చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలో నేను నటించిన సిమ్లా మిర్చి సినిమా రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చెయ్యట్లేదు. రెండు సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నాను. సో.. ఈ డిసెంబర్‌ నుండి మెల్లగా సినిమాలు చేయాలనుకుంటున్నాను అని ముగించారు.