శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (16:07 IST)

తెలుగమ్మాయిలంటే అంతచులకన ఎందుకో.. వారిలో శృంగార రసం లేదా?: చాందిని చౌదరి

తెలుగు సినిమాల్లో నటించడానికి తెలుగు అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఎందుకనో ముంబై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెస్తారని.. ఇప్పటికీ తనకు అర్థంకాదని అమాయకంగా మాట్లాడుతోంది టాలీవుడ్‌కు పరిచయమైన వర్ధమాన నటి చా

తెలుగు సినిమాల్లో నటించడానికి తెలుగు అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఎందుకనో ముంబై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెస్తారని.. ఇప్పటికీ తనకు అర్థంకాదని అమాయకంగా మాట్లాడుతోంది టాలీవుడ్‌కు పరిచయమైన వర్ధమాన నటి చాందిని చౌదరి. బిటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విశాఖకు చెందిన ఈ భామ.. వరా ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కుందనపు బొమ్మ' అనే సినిమాతో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. అంతకుముందే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌తో యూత్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన ఆమె 'కేటుగాడు' అనే సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. కానీ అది రెండవ సినిమాగా రావాల్సింది. మొదటిగా వచ్చింది. ఇక 'కుందనపు బొమ్మ'.. ఈ శుక్రవారమే విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ.. 
 
* షార్ట్‌ఫిలింస్‌ ఎక్కడ చేశారు? 
మాది విశాఖ. చదువు రీత్యా బెంగుళూరులో ఉన్నాను. అక్కడ విశాఖకు చెందిన ఫ్రెండ్స్‌తో కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. అవి చాలామందికి నచ్చింది. అది చూసి 'కుందనపు బొమ్మ'కు.. వరా నన్ను సెలక్ట్‌ చేశారు. 
 
* అయితే ఇది రెండవ సినిమానా? 
అవును. లెక్కప్రకారం ఇది మొదటి సినిమానే. కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ రావడంతో 'కేటుగాడు' మొదట విడుదలై అదే తొలి సినిమా అయింది. 
 
* 'కుందనపు బొమ్మ' ఎలా ఉండబోతోంది? 
తెలుగు సాంప్రదాయాలు, పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో నడిచే అందమైన కథే ఈ 'కుందనపు బొమ్మ'. అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా మంచి కామెడీ ఈ సినిమాలో ఉంది. 
 
* మీ పాత్ర ఎలా వుంటుంది? 
నేను సుచి (సుచిత్రా) అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సుచికి ఉండే కొన్ని సమస్యలు, తన చుట్టూ ఉండే ఇద్దరు వ్యక్తుల వల్లే మారే పరిస్థితులూ.. ప్రధానంగా కథంతా ఇక్కడే తిరిగే ఇలాంటి పాత్రలో నటించడానికి మొదట భయపడ్డా. నాకు, సుచి పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ పాత్రను అర్థం చేసుకుని తర్వాత దర్శకుడి సలహాల మేరకు చేసేశా. 
 
* హీరోయిన్‌గా మారడానికి మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు? 
షార్ట్‌ ఫిల్మ్స్‌ అన్నీ సరదాగా చేసినవే! ఫ్రెండ్స్‌ అంతా ఒక దగ్గర చేరడం, ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీయడం చూసి అందులో నేను కేవలం సరదాకే నటిస్తుండేదాన్ని. ఫీచర్‌ సినిమా అందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంటుంది. ఇదే నా ప్రొఫెషన్‌ అనుకున్నాకే ఇక్కడికి వచ్చా. ఇకపోతే ఇక్కడ పరిస్థితులు కూడా వేరేలా ఉంటాయి. అందరినీ నమ్మడానికి లేదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. 
 
* 'అందరినీ నమ్మడానికి లేదు' అంటున్నారు.. ఎవరివల్లైనా ఇబ్బందులు వచ్చాయా? 
ప్రముఖ నిర్మాణ సంస్థ నాతో సినిమా చేస్తున్నట్లు చెప్పి.. నాతో రెండేళ్ళు అగ్రిమెంట్‌ రాసుకుంది. కానీ రెండేళ్ళయినా నాకు అవకాశం ఇవ్వలేదు. ముంబైకు చెందిన టీవీ ఆర్టిస్టుతో సినిమా తీసేశారు. అప్పుడే అందరి మాటలూ నమ్మడానికి లేదని ఫిక్స్‌ అయిపోయా. 
 
* ఏ సంస్థ చెప్పగలరా? 
వద్దులేండి.. ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకోవాలని చూస్తున్నా.. అయినా మీడియావారికి అన్నీ తెలుసు. ఇంతకంటే నన్ను అడక్కండి.. 
 
* తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలు వస్తూంటాయని అంటారు. మీరు కూడా ముంబైనో ఢిల్లీనో బెంగుళూరో అని చెప్పి ఇంగ్లీషులో మాడ్లాడవచ్చుగదా? 
ఈ విషయమే నాకూ అస్సలు అర్థం కాదు. చక్కగా తెలుగు మాట్లాడే, బాగా నటించగలిగే అమ్మాయిలు ఉన్నా కూడా ఎక్కువగా బయటివారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో తెలియదు. ఈమధ్య కాస్త పరిస్థితులు మారుతున్నాయనే అనుకుంటున్నా. 
 
* నటిగా కుటుంబ ప్రోత్సాహం ఉందా? 
మాది విద్యావంతుల కుటుంబం. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాకే.. నీకు ఏం కావాలనుకుంటే ఆ రూటులో వెళ్ళమని మా తల్లిదండ్రులు చెప్పారు. అందుకే బెంగుళూరు వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్‌ చేశాను. పూర్తయ్యాక.. నటిగా మారాను. 
 
* మరి ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 
కమర్షియల్‌ సినిమాలకు ఎక్స్‌పోజింగ్‌ అవసరం చెబుతారు. నామటుకు పాత్రను బట్టి.. ఎక్కువ ఎక్స్‌పోజింగ్‌ లేకుండా గ్లామర్‌గా కనబడతానికి ఇష్టపడతా. అటువంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. 
 
* కెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకుంటున్నారు? 
ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు చేస్తున్నా. అందులో ఒకటి దర్శకుడు ఫణీంద్ర తెరకెక్కించే 'మను', బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ కథ చాలా కొత్తగా అనిపించింది.