నటన నాకు ఫ్యాషన్‌. అందుకే నటిస్తున్నా.. అంటున్న బాపు గారి బొమ్మ

అత్తారింటికి దారేదీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసిపోయిందామె. బాపుగారి బొమ్మగా పాటలో కూడా కుర్రకారుకు పిచ్చెక్కించిన గ్లామరస్ నటి ప్రణీత. కానీ దక్షిణాదిలో అన్ని భాషల్లో అగ్రహీరోలతో కూడా నటించినా అత్తారింటికి దారేది తప్ప తక్క

హైదరాబాద్| Raju| Last Modified గురువారం, 3 ఆగస్టు 2017 (08:10 IST)
అత్తారింటికి దారేదీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసిపోయిందామె. బాపుగారి బొమ్మగా పాటలో కూడా కుర్రకారుకు పిచ్చెక్కించిన గ్లామరస్ నటి ప్రణీత. కానీ దక్షిణాదిలో అన్ని భాషల్లో అగ్రహీరోలతో కూడా నటించినా అత్తారింటికి దారేది తప్ప తక్కిన సినిమాలు ఏవీ ఆడకపోవడంతో హీరోయిన్‌గా పెద్దగా నిలదొక్కుకోలేక పోయిందామె. కానీ కెరీర్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి పెద్దగా అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు అంటున్న ఈ చారెడేసి కళ్ల భామ పబ్‌లకు,. పార్టీలకు వెళ్లే కల్చర్ తనకు లేదని ఘంటాపథంగా చెబుతోంది. సినీరంగంలో ఆమె అనుభవాలను ఆమె మాటల్లోనే విందాం.

ఎక్కువ చిత్రాలు చేయాలన్న ఆసక్తి, వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవాలన్న ఆశ నాకు లేవు. మా అమ్మానాన్న ఇద్దరు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. మరో విషయం ఏమిటంటే అన్ని భాషల్లోనూ ఒకేసారి నటించడం సాధ్యం కాదు. తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ భాషల్లో నటించడానికే సమయం సరిపోతోంది.

ప్రేక్షకులెవరూ నా గ్లామర్‌ గురించి కామెంట్‌ చేయడం లేదు. తెలుగు చిత్రాల్లో హీరోయిన్లు ఎక్స్‌పోజ్‌ చేయాల్సి ఉంటుందన్న విషయం గురించి నేనూ విన్నాను. అయితే నేను నటించిన చిత్రాలు చూస్తే అలాంటి కామెంట్‌లకు అవకాశం ఉండదు. నన్నెవరూ గ్లామరస్‌గా నటించమని ఒత్తిడి చేయలేదు కూడా. కథ, పాత్రలకు తగ్గట్టుగానే నా నటన ఉంటుంది.

జీవితంలో ఎక్కువగా ఆశించకూడదు. ఒక వేళ ఆశపడింది జరగకపోతే చాలా నిరాశ పడాల్సి వ స్తుంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన, నాకు నప్పే పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. నేను ఎన్నేళ్లు నటిస్తానో తెలియదు. అది నా చేతుల్లో లేదు. నటన నాకు ఫ్యాషన్‌. అందుకే నటిస్తున్నాను.

హోటల్‌ బిజినెస్‌ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అమ్మానాన్నలకు సొంతంగా బెంగళూరులో ఆస్పత్రి ఉంది. నటన చాలు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను చూసుకో అంటున్నారు.
ఏం జరుగుతుందో చూడాలి మరి!
దీనిపై మరింత చదవండి :